Summer Health Tips: వడదెబ్బ తగలకుండా ఉండాలంటే…? ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి..

|

Feb 21, 2024 | 4:32 PM

ఆహారంతో పాటు దుస్తుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి వాతావరణంలో మందపాటి బట్టలు, ముదురు రంగు దుస్తులు ధరించడం మానుకోండి. ఎందుకంటే అవి వేడిని గ్రహించి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. కాబట్టి కాటన్ బట్టలు, లేత రంగు దుస్తులు ధరించండి. అంతే కాకుండా బయటికి వెళ్లేటప్పుడు చర్మానికి సరిపోయే క్రీమ్ వాడటం మంచిది.

Summer Health Tips: వడదెబ్బ తగలకుండా ఉండాలంటే...? ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి..
Summer Health Tips
Follow us on

వేసవి కాలం వచ్చేసింది. అప్పుడే రోజురోజుకు వేడి పెరుగుతోంది. దీంతో రకరకాల వ్యాధులు కూడా వస్తున్నాయి. రానున్న రోజుల్లో వేడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో, ఆరోగ్య విషయాలపై కొంత శ్రద్ధ అవసరం. కాబట్టి వేసవి కాలంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి. వేడి వాతావరణంలో, మీరు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో శరీరానికి ఎక్కువ నీరు అవసరం. లేదంటే డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శరీరాన్ని చల్లబరిచే ఆహారాలు తినండి. మీ ఆహారంలో పుష్కలంగా పండ్లు, కూరగాయలను చేర్చుకోండి. మసాలా, స్పైసీ ఫుడ్స్‌ తీసుకోకపోవడమే మంచిది. అంటే జీర్ణం కావడానికి కష్టంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఉదాహరణకు, చికెన్, మటన్, ఫ్రైలు వంటివి తగ్గించండి. బదులుగా కూరగాయలు పుష్కలంగా తినండి. కూలింగ్ ఫుడ్స్, డ్రింక్స్ కూడా తీసుకోవటం మంచిది. ఉదాహరణకు పెరుగు, మజ్జిగ, సాంబార్ వంటివి రోజూ తినడం మంచిది. ఇది శరీర ఉష్ణోగ్రత పెరగకుండా సహాయపడుతుంది.

ఆహారంతో పాటు దుస్తుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి వాతావరణంలో మందపాటి బట్టలు, ముదురు రంగు దుస్తులు ధరించడం మానుకోండి. ఎందుకంటే అవి వేడిని గ్రహించి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. కాబట్టి కాటన్ బట్టలు, లేత రంగు దుస్తులు ధరించండి. అంతే కాకుండా బయటికి వెళ్లేటప్పుడు చర్మానికి సరిపోయే క్రీమ్ వాడటం మంచిది.

* కింది సూచనలను పాటించాలి.

ఇవి కూడా చదవండి

– పగటిపూట ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎక్కువసేపు సూర్యరశ్మికి గురికాకుండా ఉండండి.

– శుభ్రమైన నీరు పుష్కలంగా తాగాలి. దాహం వేయకపోయినా నీళ్లు తాగుతూనే ఉండండి.

– పగటిపూట ఆల్కహాల్, కాఫీ, టీ మరియు కార్బోనేటేడ్ శీతల పానీయాలు వంటి డీహైడ్రేటింగ్ పానీయాలను నివారించండి.

– వదులుగా, లేత రంగు కాటన్ దుస్తులను ధరించండి.

– బయటకు వెళ్లేటప్పుడు పాదరక్షలు ధరించండి. గొడుగు లేదా టోపీని ఉపయోగించడం మంచిది.

– పండ్లు, కూరగాయలు పుష్కలంగా తినండి. ORS ద్రావణం, లెమన్ వాటర్ వంటివి ఎక్కువగా తీసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..