Period Care: పీరియడ్స్‌ సమయంలో ఈ ఆహారాలు అస్సలు తినకండి..

|

Oct 15, 2024 | 3:36 PM

పీరియడ్స్‌ అనగానే చాలా మంది మహిళలు భయ పడుతూ ఉంటారు. ఎందుకంటే పీరియడ్స్ అనేవి అందరిలోనూ ఒకేలా ఉండవు. కొందరికి జ్వరం, నీరసం,అలసట, ఒళ్లు నొప్పుడు, కడుపులో నొప్పులు, బాడీ పెయిన్స్, నడుము నొప్పి, కాళ్లు చేతులు లాగడం, తల నొప్పి, వికారం ఇలా చాలా రకాల లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. చాలా మందికి నెలసరిలో క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. కారంగా ఉండేవి తినాలని..

Period Care: పీరియడ్స్‌ సమయంలో ఈ ఆహారాలు అస్సలు తినకండి..
Periods
Follow us on

పీరియడ్స్‌ అనగానే చాలా మంది మహిళలు భయ పడుతూ ఉంటారు. ఎందుకంటే పీరియడ్స్ అనేవి అందరిలోనూ ఒకేలా ఉండవు. కొందరికి జ్వరం, నీరసం,అలసట, ఒళ్లు నొప్పుడు, కడుపులో నొప్పులు, బాడీ పెయిన్స్, నడుము నొప్పి, కాళ్లు చేతులు లాగడం, తల నొప్పి, వికారం ఇలా చాలా రకాల లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. చాలా మందికి నెలసరిలో క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. కారంగా ఉండేవి తినాలని, పుల్లగా ఉండేవి తినాలని.. స్వీట్స్ తినాలని చాలా రకాలుగా అనిపిస్తుంది. అలా అని ఏవి పడితే అవి తీసుకోకూడదు. కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలే తీసుకోవాలి. చాలా మంది ఏవి పడితే అవి తినేస్తూ ఉంటారు. కొన్ని రకాల ఆహారాలను అస్సలు తీసుకోకూడదట. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

పీరియడ్స్‌లో తీసుకోకూడదని ఆహారాలు ఇవే..

* క్రేవింగ్స్ ఉన్నాయి కదా అని.. ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, కేకులు వంటివి తినకూడదు. ఇవి ఉన్న సమస్యలకు తోడు మరిన్ని సమస్యలు తెచ్చి పెడతాయి. కడుపులో నొప్పి, అజీర్తి సమస్యలు వస్తాయి.

* అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలు, వేయించిన ఆహారాలు, కూల్ డ్రింక్స్, సోడాలు కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి జీర్ణ సమస్యలను, ఇతర వ్యాధులను పెంచుతాయి. వీటిల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరారీంలో వాపును పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

* అలాగే చిప్స్, పిజ్జాలు, బర్గర్‌లు కూడా తీసుకోకూడదు. వీటి వలన శరీరంలోకి బ్యాడ్ కొలెస్ట్రాల్ వచ్చి చేరుతుంది. దీంతో షుగర్, బీపీ పెరుగుతాయి.

* కాఫీ, టీ, ఆల్కహాల్ తింటే మూత్ర విసర్జనను పెంచుతాయి. బాడీని డీహైడ్రేట్ చేస్తాయి. కడుపలో నొప్పిని కూడా పెంచుతాయి.

* జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, నూనె ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే.. గ్యాస్, అజీర్తి, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు పెరుగుతాయి. కడుపులో నొప్పిని కూడా పెంచుతాయి. దీంతో మరింత అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు పండ్లు, ఆరోగ్యకరమైన జ్యూసులు, ఆకు కూరలు తీసుకోవడం బెటర్.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..