SKIN CARE: మెటిమలు రాకుండా చర్శం తలతలా మెరిసిపోవాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి..

|

Oct 02, 2022 | 5:52 PM

చర్మ సౌందర్యానికి ప్రతి ఒక్కరూ ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి వక్తి చర్మం తలాతలా మెరిసిపోవాలని కోరుకుంటారు. కొంతమంది వ్యక్తుల చర్మం త్వరగా పొడిబారిపోతుంది. వాతావరణాన్ని బట్టి కూడా చర్శ సౌందర్యం ఆధారపడి ఉంటుంది. చర్మం త్వరగా ముడత పడితే వయసులో..

SKIN CARE: మెటిమలు రాకుండా చర్శం తలతలా మెరిసిపోవాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి..
Skin Care
Follow us on

చర్మ సౌందర్యానికి ప్రతి ఒక్కరూ ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి వక్తి చర్మం తలాతలా మెరిసిపోవాలని కోరుకుంటారు. కొంతమంది వ్యక్తుల చర్మం త్వరగా పొడిబారిపోతుంది. వాతావరణాన్ని బట్టి కూడా చర్శ సౌందర్యం ఆధారపడి ఉంటుంది. చర్మం త్వరగా ముడత పడితే వయసులో ఉన్నా ముసలివారిలా కనబడుతూ ఉంటారు. అందుకే చర్శ రక్షణకు చాలా మంది ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. మనం తినే ఆహారంతో పాటు చర్మానికి రాసే క్రీములను బట్టి కూడా చర్శ సౌందర్యం ఆధారపడి ఉంటుంది. చాలా మంది చర్మం తలతలా మెరిసేందుకు మార్కెట్లో దొరికే అనేక ఉత్పత్తులను వాడుతుంటారు. ఎక్కువ ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో సహజమైన పద్ధతుల్లోనూ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఆరోగ్యవంతమైన చర్మం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఎటువంటి పదార్థాలను ఉపయోగించాలో తెలుసుకుందాం. ఉసిరి, వేప, పసుపు వంటి పదార్థాలను ఆహారంతో పాటు తీసుకోవడం ద్వారా చర్మ శుద్ధికి దోహద పడుతుంది. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా చర్మం లోపల ఉండే విష పదార్థాలు బయటకు వచ్చేస్తాయి. తద్వారా చర్మం మెరవడానికి అవకశం ఉంటుంది. చర్మ సౌందర్యాన్ని కోరుకునేవారు దానికి తగిన డైట్ ఫాలో అయితే మాత్రం వారి చర్మం తాజానంతో మెరిసిపోతుంది.

వారంలో ఒకసారైనా చేపలు తినడం ద్వారా వాటిలో ఒమేగా ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని కాపాడతాయి. బాదం పప్పు, అవిశె గింజల్లో కూడా ఒమేగా ఆమ్లాలు ఎక్కువుగానే ఉంటాయి. చేపలతో పాటు బాదం పప్పు, అవిశె గింజలు వంటివి మన ఆహారంలో తీసుకోవడం చర్మ సౌందర్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఒమెగా ఆమ్లాలు చర్మంలోని తేమ బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు చర్మం నునుపుగా ఉండేందుకు దోహదం చేస్తుంది.

చర్మ సౌందర్యాన్ని కోరుకునేవారు గోధుమలు, పెసలు బార్లీ వంటి వాటితో తయారుచేసిన పదార్థాలు తినడం మంచిది. అయితే గోధుమలు, పెసలు పొట్టు తియ్యకుండానే వాటితో ఏవైనా ఆహార పదార్థాలు చేసుకుని తినడం మేలు. వీటిలో ఉండే పీచు పదార్థాలు చర్మం వడలిపోకుండా కాపాడటంతో పాటు, స్కిన్ బిగుతుగా ఉండేలా చేస్తుంది. అలాగే సన్ ఫ్లవర్ ఆయిల్ తో వంటలు చేసుకుని తినడం మంచిది. చర్మ రక్షణ కోరుకునేవారు క్యాలీఫ్లవర్ కూరను వారంలో రెండు రోజులు తినడం మంచిది. క్యాలీఫ్లవర్ లో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. విటమిన్ బి6 హార్మోన్లలో అసమతౌల్యం ఏర్పడకుండా, మెటిమలు రాకుండా కాపాడుతుంది. తాజా పండ్లను తినాలి. అరటిపండు, నారింజ, జామకాయలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువుగ ఉంటాయి. ఈ పండ్లు తినడం ద్వారా చర్మం ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

చర్మం సౌందర్యంతో పాటు ముఖ్యంగా ఎదుటివారు ఎక్కువ చూసేది మన ముఖం. ఫేస్ అందంగా ఉండేందుకు, ముఖ సౌందర్యం కోసం కూడా చాలా మంది ఎన్నో ప్రయోగాలు చేస్తూ అనేక క్రీములు రుద్దుతూ ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే మన ముఖం అందంగా కన్పించాలంటే ముందు నిర్ధిష్ట సమయం నిద్రపోవాలి. మన చర్మం పొడిబారుతోందంటే మనం సరిగ్గా అవసరమైనంత సమయం నిద్రపోవడం లేదని అర్థం చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు తేనెను కళ్ల కింద ఉబ్బుగా ఉన్న చోట రాసుకోవడంతో పాటు ముఖంపై తేనె రాసి మృదువుగా రుద్దాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా రోజూ కాకపోయినా వారంలో మూడు సార్లు చేయడం ద్వారా చర్మకాంతి పెరుగుతుంది. రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ లో ముంచిన దూదితో ముఖమంతా మర్ధన చేయడం ద్వారా మన ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. దూదిని ఆలివ్ ఆయిల్ లో ముంచి మసాజ్ లా ముఖాన్ని ఒత్తిడి చేస్తూ మర్ధన చేయడం ద్వారా ఫేస్ పై ఉన్న దుమ్ము, కణాలు, మేకప్ డస్ట్ సులువుగా పోతాయి. ఆ తర్వాత ఫేష్ వాస్ చేసుకుని రెగ్యులర్ గా వాడే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ముఖ, చర్మ సౌందర్యాన్ని కోరుకునే వారు ప్రతి రోజూ తగినంత నీరు తాగాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..