AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: నానబెట్టిన బాదం పప్పు తింటున్నారా? ఈ ప్రయోజనాల గురించి తెలుసుకోండి..

బాదంపప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బాదంపప్పుల్లో అధిక పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు..

Health Tips: నానబెట్టిన బాదం పప్పు తింటున్నారా? ఈ ప్రయోజనాల గురించి తెలుసుకోండి..
Almonds
Shiva Prajapati
|

Updated on: Oct 02, 2022 | 7:21 PM

Share

బాదంపప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బాదంపప్పుల్లో అధిక పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని అనేక రకాలుగా తినవచ్చు. కానీ వీటిని తినడానికి ఉత్తమ మార్గం రాత్రంతా నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. మరి నానబెట్టిన బాదం పప్పును తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మెదడు ఆరోగ్యం..

మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు బాదం పప్పు తినడం ఉత్తమం. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌‌ను తగ్గడించడంలో అద్భుతంగా పని చేస్తుంది.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది..

బాదం పప్పులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది ఎల్‌డీఎల్ ను తగ్గించి, హెచ్‌డీఎల్‌ను పెంచుతుంది. బాదం పప్పులో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇందులో యాంటీఆక్సీడెంట్స్, ఫ్లేవనాయిడ్‌లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. ధమనులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

బరువు తగ్గడంలో సహాయం..

బరువు తగ్గడంలో బాదం పప్పు సహాయపడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇది మీ కడుపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా ఎక్కువ ఆహారం తినకుండా ఉంటారు.

శరీరానికి పోషకాలు..

బాదం పప్పులో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ తో సహా అనేక పోషకాలు ఉన్నాయి. వీటిని రాత్రి నానబెట్టి, ఉదయాన్నే తినడం వలన ఈ పోషకాలన్నీ శరీరానికి అందుతాయి.

బ్లడ్ షుగర్ నియంత్రణ..

బాదం పప్పు తినడం వలన బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. బాదంలో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్స్ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!