Diabetes: చర్మంపై ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయా.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి..

మధుమేహ వ్యాధి బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్నారు. రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిలు అధికంగా ఉంటే షుగర్ వ్యాధి బారిన పడతారు. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. అయితే డయాబెటిస్ నేరుగా చర్మానికి సంబంధించినది. డయాబెటిస్ విషయంలో ప్రారంభ లక్షణాలు చర్మంపై కనిపిస్తాయి. ఈ లక్షణాలలో చర్మంపై దురద, ఎర్రటి దద్దుర్లు ఉంటాయి. అంతేకాదు చర్మంపై ఏదైనా మార్పు కనిపిస్తే ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ ను తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు. చర్మంపై ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం..

Diabetes: చర్మంపై ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయా.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి..
Diabetes

Updated on: May 13, 2025 | 9:29 AM

డయాబెటిస్ ప్రారంభంలో వ్యాధి లక్షణాలు మీ చర్మంపై కూడా కనిపిస్తాయి. సాధారణంగా డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు చర్మం ద్వారా మాత్రమే కనిపిస్తాయి. జననేంద్రియాల చర్మంపై మొటిమలు దీని ప్రారంభ లక్షణంగా పరిగణించబడతాయి. దీనితో పాటు చర్మంపై ఏదైనా కోత లేదా గాయం మానడానికి ఎక్కువ సమయం తీసుకుంటే అది కూడా మధుమేహం వల్లే అని భావించాలి. అంతేకాదు మధుమేహానికి సంబంధించిన అనేక లక్షణాలు చర్మంపై కూడా బయటపడతాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే మీ చక్కెర స్థాయిని తనిఖీ చేసి తగిన విధంగా చికిత్స తీసుకోవడం మొదలు పెట్టాలి.

ప్రస్తుతం డయాబెటిస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న వ్యాధి. మారిన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఈ వ్యాధి ఇప్పుడు యువతను కూడా ప్రభావితం చేస్తోంది. డయాబెటిస్ ఉన్నప్పుడు దాని ప్రభావం చర్మంపై కూడా కనిపిస్తుంది. ఇందులో చర్మం పొడిబారడం, దూడలపై మచ్చలు, నల్లటి మచ్చలు, ఎర్రటి దద్దుర్లు, చర్మం నల్లగా మారడం వంటివి కూడా ఉన్నాయి. చర్మంపై అలాంటి మార్పు కనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించి షుగర్ లెవెల్స్ ను తనిఖీ చేసుకోవాలి.

చర్మంపై ప్రభావాలు

మధుమేహం ఉన్నవారిలో సాధారణంగా రాత్రి సమయంలో తరచుగా మూత్ర విసర్జన చేస్తారు. ఇది షుగర్ వ్యాధి ప్రారంభ లక్షణం అని RML హాస్పిటల్‌లోని డెర్మటాలజీ విభాగానికి చెందిన మాజీ డాక్టర్ భావూక్ ధీర్ అంటున్నారు. దీనితో పాటు మధుమేహం ప్రారంభంలో చర్మంపై లక్షణాలు కూడా కనిపిస్తాయి. చర్మంపై అనేక రకాల మార్పులు కనిపిస్తాయి. చర్మం పొడిబారడం, చర్మంపై చాలా చోట్ల ఎర్రటి దద్దుర్లు. దీనిలో నొప్పి, దురద వంటి అనుభూతి చెందుతుంది.

ఇవి కూడా చదవండి

దీనితో పాటు చంకలు, మెడ సహా ఇతర ప్రదేశాలలో చర్మం నల్లగా మారుతుంది. దీనిని అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటారు. చేతులు, కాళ్ళపై చిన్న బొబ్బలు కూడా కనిపించవచ్చు. కాలి వేళ్లు, వేళ్లపై బహిరంగ పుండ్లు లేదా పూత బారిన పడవచ్చు. డయాబెటిస్ కూడా గ్యాంగ్రీన్‌కు కారణమవుతుంది. దీనికి చికిత్స లేదు. దీనితో పాటు చర్మం కూడా సన్నగా మారవచ్చు.

ఈ పరిహారం వెంటనే చేయండి

మీ చర్మంపై పైన పేర్కొన్న లక్షణాలను మీరు గమనించినట్లయితే.. వెంటనే షుగర్ లెవెల్స్ ను తనిఖీ చేసుకోవాలి. చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వైద్యుడిని సంప్రదించి మధుమేహ నిర్వహణకు మందులు తీసుకోవడం ప్రారంభించండి. వేడి నీటితో స్నానం చేయవద్దు. ఎందుకంటే ఇది చర్మాన్ని పొడిగా చేస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి. చర్మం దురదగా అనిపిస్తే గోక వద్దు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. పాదాలను శుభ్రంగా, పొడిగా ఉంచుకోండి. అంతేకాదు దినచర్యలో, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)