Covid Care: బీపీ, షుగర్, ఒబేసిటీ ఉన్నవారు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంటో తెలుసా..

|

May 05, 2021 | 3:44 PM

కరోనా సెకండ్ వేవ్.. ప్రస్తుతం భారత్‏లో విలయతాండవం చేస్తోంది. రోజుకీ లక్షల్లో కేసులు బయటపడుతుండగా.. మరణాల సంఖ్య కూడా ఆందోళనకు గురిచేస్తోంది.

Covid Care: బీపీ, షుగర్, ఒబేసిటీ ఉన్నవారు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంటో తెలుసా..
Covid Care
Follow us on

కరోనా సెకండ్ వేవ్.. ప్రస్తుతం భారత్‏లో విలయతాండవం చేస్తోంది. రోజుకీ లక్షల్లో కేసులు బయటపడుతుండగా.. మరణాల సంఖ్య కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ఇప్పటికే పలు దేశాలు భారత్‏ను రెడ్ జోన్ గా ప్రకటించాయి. ఇక్కడి నుంచి ఎవరకు తమ దేశాలకు రాకూడదను హెచ్చరికలు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మహమ్మారి చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సోకే అవకాశం ఉంది. షుగర్, బీపీతోపాటు ఒబేసిటీ ఉన్నవారికి కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువలన వారు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు కావాల్సిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అయితే వీరు కరోనా రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

వీరు ఎక్కువగా పండ్లు, రసాలు ఎక్కువగా తీసుకోవాలి. షుగర్, బీపీ నియంత్రణలో ఉంచుకోవాలి. ఊబకాయులకు ఊపిరితిత్తులు విచ్చుకోవడం (ఎక్స్ పాన్షన్)తక్కువగా ఉంటుంది. వారికి కోవిడ్ వస్తే ఛాతీపై బోర్లా పడుకుని తల పక్కకు తిప్పుతూ 2,3 గంటలకు ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకోవాలి. దానివలన వారి ఆక్సిజన్ శాచురేషన్ స్థాయిలు పెంచుకోగలుగుతారు. పూర్తిగా బోర్లా పడుకోలేని వారు ఒక పక్కకైనా తిరిగి పడుకోవాలి. ఇక బీపీకీ వైరస్ పెరుగుదలకు అసలు సంబంధం లేదు. బీపీకి వాడే మందులు వైరస్ తీవ్రతను పెంచుతాయని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇది కేవలం అసత్య ప్రచారమని నిపుణులు అంటున్నారు. బీపీ, షుగర్ ఉన్నవారిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వీరికి కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఇస్తారు. కాబట్టి షుగర్, బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. అందువలన పేషెంట్లు తమ మందులను తప్పనిసరిగా కొనసాగించాలి. ఆటోమేటిక్ బీపీ చెకింగ్ ఎలక్ట్రానిక్ మీటర్ల ద్వారా చెక్ చేసుకోవచ్చు. రోజుకు రెండుసార్లు షుగర్ పరీక్షించుకోవాలి. అంతేకాదు.. ఒకవేళ షుగర్ లెవల్స్ పెరిగితే డాక్టర్లను తప్పనిసరిగా సంప్రదించాలి.

Also Read: Nikki Thamboli: బిగ్‏బాస్ నటి ఇంట్లో తీవ్ర విషాదం.. కరోనాతో నిక్కి తంబోలి సోదరుడు మృతి.. ఎమోషనల్ ట్వీట్..

పరభాష చిత్రాలను నమ్ముకుంటున్న సీనియర్ హీరో.. మరో సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేసే పనిలో వెంకీ..