స్పీడ్‌గా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..? అయితే ఈ ఐదు పద్దతులను పాటించండి.. రిజల్ట్ మీరు ఊహించలేరు..
Weight Lose : బరువు తగ్గడానికి చాలా మంది వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తారు. వారిలో చాలామంది ఆహారం తినకపోవడం వల్ల బరువు తగ్గవచ్చని
Weight Lose : బరువు తగ్గడానికి చాలా మంది వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తారు. వారిలో చాలామంది ఆహారం తినకపోవడం వల్ల బరువు తగ్గవచ్చని అనుకుంటారు కానీ అది తప్పు. బదులుగా మీరు ఆరోగ్యకరమైన వస్తువులను తినాలి. మీ జీవనశైలిలో చిన్న మార్పులు చేయండి. మీ రోజువారీగా కేలరీలను తీసుకోవడం నియంత్రించండి. ఇవన్నీ చేయడం వల్ల మీరు వేగంగా బరువు తగ్గవచ్చు. కొన్ని ప్రత్యేక చిట్కాల వల్ల బరువు ఎలా తగ్గాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 1. కొంతమంది బరువు తగ్గడానికి పండ్ల రసాలు తాగుతారు. అయితే అలా చేయకుండా నేరుగా పండ్లు తినండి. ఇది కేలరీల పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఒక అధ్యయనంలో పండు తినడం టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని తేలింది.
2. ఎక్కువ తినడం వల్ల ఎక్కువ కేలరీలు, అనవసరమైన బరువు పెరుగుతుంది. తగినంత తినడం వల్ల బరువు పెరగదు అంతేకాకుండా కేలరీలు అదుపులో ఉంటాయి.ఈ అలవాటును అవలంభించడం ద్వారా మనం కొద్ది రోజుల్లో బరువు తగ్గవచ్చు.
3. భోజనం తర్వాత కొంత సమయానికి మీరు ఏదైనా తినాలనుకుంటారు.. కేలరీలు పెరిగే అవకాశం ఉన్నందున ఆ సమయంలో తినడం మానుకోండి. మీరు బరువు తగ్గాలంటే నీరు త్రాగాలి. నీరు త్రాగటం దాహాన్ని తీర్చడమే కాకుండా ఆకలిని కూడా తగ్గిస్తుంది.
4. మీరు ఆకలితో ఉన్నప్పుడు తినడం మానేస్తున్నారా.. అయితే మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. బదులుగా మీరు ఆ సమయంలో కొద్దిగా తినాలి. ఇది అనవసరమైన ఆకలిని నివారించడానికి, బరువును అదుపులో ఉంచడానికి మీకు సహాయపడుతుంది.
5. అమెరికన్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో రొట్టె, తృణధాన్యాలు, ఇతర ఆహారాలకు ఒక టీస్పూన్ దాల్చిన చెక్కను జోడించడం ద్వారా చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చని కనుగొన్నారు. అలాగే మీకు ఎక్కువసేపు ఆకలి కూడా అనిపించదు.