Conjunctivitis: ఈ కాలంలోనే కండ్ల కలక వ్యాపించేది.. ఈ జాగ్రత్తలు పాటించారంటే మీ కళ్లు సేఫ్‌!

|

Nov 12, 2022 | 12:54 PM

సర్వేంద్రియానం నయనం ప్రధానం'.. కళ్లు శరీరానికి దీపాల వంటివి. వాటిని ఎల్లవేళల కాపాడుకోకపోతే దృష్టిలోపాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇక వాతావరణ మార్పుల కారణంగా కంటి సమస్యలు తలెత్తడం కూడా పరిపాటే. నిజానికి.. కంటికి ఏ చిన్న సమస్య తలెత్తినా కళ్లు..

Conjunctivitis: ఈ కాలంలోనే కండ్ల కలక వ్యాపించేది.. ఈ జాగ్రత్తలు పాటించారంటే మీ కళ్లు సేఫ్‌!
Conjunctivitis
Follow us on

‘సర్వేంద్రియానం నయనం ప్రధానం’.. కళ్లు శరీరానికి దీపాల వంటివి. వాటిని ఎల్లవేళల కాపాడుకోకపోతే దృష్టిలోపాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇక వాతావరణ మార్పుల కారణంగా కంటి సమస్యలు తలెత్తడం కూడా పరిపాటే. నిజానికి.. కంటికి ఏ చిన్న సమస్య తలెత్తినా కళ్లు ఎర్రబడిపోతుంటాయి. ముఖ్యంగా వానాకాలంలో ఇన్‌ఫెక్షన్ల బెడద కాస్త ఎక్కువగానే ఉంటుంది. సుదీర్ఘకాలంగా కురుస్తున్న వానల వల్ల కండ్లకలక (కంజెక్టివైటీస్‌) వంటి కంటి ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. కంటి గుడ్డు చుట్టూ ఉండే తెల్లని పొర, కంటి రెప్పల వెనుక ఉండే పొరలను కంజెటైవా అని అంటారు. కళ్లలోకి దుమ్ము, ధూళి, నీళ్ల వంటివి పడటంవల్ల కండ్ల కలకకు కారణమయ్యే ఇన్‌ఫెక్షన్‌ వల్ల బ్యాక్టీరియా, వైరస్‌ ఎక్కువగా వ్యాపిస్తుంది.

కండ్ల కలక సమస్య తలెత్తితే.. స్వీయ వైద్యం చేసుకోవడం కంటి ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిదికాదని ముంబాయిలోని డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ నీతా షా సూచిస్తున్నారు. ఇంకా ఏం చెబుతున్నారంటే.. వైరస్ ఎక్కువగా సోకడం వల్ల కండ్ల కలక ఉన్న రోగుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. కండ్ల కలక రోగులను సాధారణంగా వారం రోజుల పాటు ఇబ్బంది పెడుతుంది. ఆ తర్వాత తగ్గిపోతుంది. ఇతరులకు వ్యాప్తి చెందితే అది మూడు వారాలపాటు వేధిస్తుంది. కంటిలోపల ఉండే తెల్లని పొర నుంచి కంటి గుడ్డుకు వ్యాప్తిస్తే చూపు మందగించే ప్రమాదం ఉంది. ఒక్కోసారి కార్నియాకు రంధ్రాలు కూడా పడతాయి. అటువంటి పరిస్థితుల్లో కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది.

కండ్లకలక లక్షణాలు..

కండ్లకలక సోకిన వ్యక్తికి సాధారణంగా ఈ కింది లక్షణాలు ఉంటాయి. అవేంటంటే.. కళ్లు ఎరుపెక్కడం, నీళ్లు కారడం, రెప్పలు ఉబ్బడం, దురద, గుచ్చుకోవడం, నొప్పి, కళ్ల వాపు. కండ్లకలకతో బాధపడేవారిలో కొంతమందికి జలుబు, దగ్గు, జ్వరం కూడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఏం చెయ్యాలి?

కండ్లకలక లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని కంటి వైద్యుడి (ఆప్తమాలజిస్ట్‌)ని సంప్రదించాలి. ఐ డ్రాప్స్‌తో స్వీయ వైద్యం చేసుకోకూడదు. ఇలా చేస్తే కళ్లపై దీర్ఘకాలిక దుష్ప్రభావాలు చూపుతాయి.

తీసుకోవల్సిన జాగ్రత్తలు..

  • కండ్లకలక వచ్చినప్పుడు కళ్లు దురదపెడతాయి. ఇలాంటి సందర్భంలో ఎట్టిపరిస్థితుల్లో కళ్లను నులమకూడదు.
    కంటి నుంచి నీళ్లు కారితే టిష్యూతో తుడిచి వెంటనే డస్ట్‌బిన్‌లో పారవేయండి.
  • కండ్లకలక ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాపిస్తుంది. కళ్లను తాకి, ఆ చేత్తో ఇతరును తాకితే వెంటనే ఈ వ్యాధి వారికి కూడా వ్యాపిస్తుంది.
  • కండ్లకలకతో బాధపడే వ్యక్తులు కాంటాక్ట్ లెన్సులు వాడటం మానేయాలి.
  • యాంటీ బయాటిక్‌ డ్రాప్స్‌ వాడాలి. నీళ్లతో తరచూ కళ్లను కడుగుతుంటే దురద అనిపించదు.

మరిన్ని హెల్త్ అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.