
చలి కాలం.. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.. ఈ సమయంలో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఇంకా.. చలి తీవ్రత భారీగా పెరగడంతో చాలా మంది స్నానం చేయాలంటేనే గజ గజ వణికిపోయే పరిస్థితి నెలకొంది.. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో చల్లని నీటితో స్నానం చేస్తే కలిగే లాభాలే వేరని.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన 2022 నివేదిక ప్రకారం.. చల్లని నీరు అనేక ప్రయోజనాలను అందిస్తాయని సూచిస్తుంది. ఈ సమీక్ష చల్లని నీటి స్నానం.. ఆరోగ్య ప్రభావాలను పరిశీలించింది. ఈ డేటా సర్వే ఆధారంగా ఎన్నో పరిశోధనలు చల్లటి నీటి స్నానం గురించి అధ్యయనాలను రూపొందించాయి.. ఈ అధ్యయనాలు చల్లని నీరు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయని నిరూపించాయి.
శీతాకాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుందని, శరీరానికి తగినంత ఆక్సిజన్, రక్త సరఫరా మరింత పెరుగుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. శీతాకాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల రక్త కణాలు సంకోచించి, ఆపై విస్తరిస్తాయి.. రక్తం శరీరంలోని అన్ని భాగాలకు చేరుకుంటుంది.
చల్లటి నీరు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రోగనిరోధక శక్తి వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. చల్లటి నీరు వాపును తగ్గిస్తుంది. చల్లటి నీరు చర్మ రంధ్రాలను మూసివేస్తుంది, చర్మాన్ని దృఢంగా, మెరిసేలా చేస్తుంది. ఇది జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది, మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
చల్లటి నీరు నేటి ఒత్తిడితో కూడిన జీవితం నుండి ఉపశమనం పొందటానికి సహకరిస్తుంది. ఎందుకంటే ఇది శరీరంలో ఎండార్ఫిన్ల స్థాయిలను పెంచుతుంది.. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చల్లటి నీరు కండరాల నొప్పిని కూడా తగ్గిస్తుంది.
చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు లెక్కలేనన్ని ఉన్నప్పటికీ, నిపుణులు కొన్ని హెచ్చరికలు కూడా ఇస్తున్నారు. గుండె జబ్బులు, అధిక రక్తపోటు లేదా మధుమేహం ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. ఏమైనా ఇంకా అనారోగ్య సమస్యలుంటే.. వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..