రెండు లవంగాలను నెయ్యితో కలిపి ఇలా తింటే..! పొడి దగ్గు వెంటనే మాయమవుతుంది..

|

Oct 13, 2023 | 7:26 AM

వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే పొడి దగ్గు 8 వారాల వరకూ ఉంటుంది. కాబట్టి, ఇది 8 వారాల కంటే ఎక్కువ ఉంటే, అది దీర్ఘకాలిక దగ్గు. దీర్ఘకాలిక దగ్గు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. పొడి దగ్గు సాధారణంగా రాత్రిపూట మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే, పొడి దగ్గు సిరప్‌లు ప్రతిసారి అంత ఎఫెక్టివ్‌గా పనిచేయవు.. కానీ కొన్ని ఇంటి నివారణలు మాత్రం తప్పక ఉపశమనం కలిగిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

రెండు లవంగాలను నెయ్యితో కలిపి ఇలా తింటే..! పొడి దగ్గు వెంటనే మాయమవుతుంది..
Clove With Honey
Follow us on

వాతావరణ మార్పు నేరుగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వాతావరణ మార్పులతో ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అందులో ఒకటి దగ్గు. మారుతున్న వాతావరణంలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు దగ్గు అనేది సాధారణ సమస్య. ముఖ్యంగా పొడి దగ్గు, ఒకసారి మొదలైతే రోజుల తరబడి వేధిస్తుంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే పొడి దగ్గు 8 వారాల వరకూ ఉంటుంది. కాబట్టి, ఇది 8 వారాల కంటే ఎక్కువ ఉంటే, అది దీర్ఘకాలిక దగ్గు. దీర్ఘకాలిక దగ్గు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. పొడి దగ్గు సాధారణంగా రాత్రిపూట మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే, పొడి దగ్గు సిరప్‌లు ప్రతిసారి అంత ఎఫెక్టివ్‌గా పనిచేయవు.. కానీ కొన్ని ఇంటి నివారణలు మాత్రం తప్పక ఉపశమనం కలిగిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

తేనె – లవంగాలు నివారణ:

తేనె, లవంగాలు ప్రతి ఇంట్లో లభించే సాధారణ పదార్థాలు. కానీ చాలా మందికి వాటి సరైన ఉపయోగం తెలియదు. వేయించిన లవంగాలను తేనెతో కలిపి తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది అంటువ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. జలుబు, దగ్గు త్వరగా నయమవుతుందని చెబుతారు. కాబట్టి, వాతావరణం మారిన తర్వాత కఫం లేదా పొడి దగ్గు ఉంటే, లవంగాలను వేయించి, తేనెతో నమలడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

గోరువెచ్చని నీరు:

గోరువెచ్చని నీరు తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. నీరు కాకుండా, మీరు వేడి టీ లేదా వేడి సూప్ తాగవచ్చు.

ఉప్పునీరు:

ఉప్పునీరు తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చిన్న చెంచా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్వని నెమ్మదిగా త్రాగాలి.

వేడి ఆవిరి:

వేడి ఆవిరిని పట్టుకోవటం వల్ల కూడా గొంతు నొప్పి, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. వేడి నీటిలో పసుపు, వాము వంటవి కూడా వేసి ఆవిరి పట్టుకుంటే ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది జలుబు, ఫ్లూ వల్ల వచ్చే దగ్గు నుండి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి రసం కూడా వాడుకోవచ్చు. లేదా వంటల్లో కూడా ఉపయోగించవచ్చు.

అల్లం:

అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి. ఇది జలుబు, ఫ్లూ వల్ల వచ్చే దగ్గు నుండి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ అల్లం రసాన్ని వేడి నీటిలో కలిపి తాగవచ్చు.

తులసి:

తులసిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది జలుబు, ఫ్లూ వల్ల వచ్చే దగ్గు నుండి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది. తులసి ఆకులను నేరుగా నమిలి సరే, లేదంటే.. తులసి ఆకులను వేడి నీటిలో మరిగించి తాగినప్పుడు కూడా ఫలితం ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మంచిది.