ఇటీవల రథసప్తమి పండుగ పూజలు ఘనంగా జరిగాయి. రథసప్తమి అనంతరం భారత్‌లో ఎండలు క్రమేపి పెరుగుతున్నాయి. ముఖ్యంగా పల్లెటూళ్లల్లో శివరాత్రి రోజు నుంచి శివశివ అంటూ చలి వెళ్లిపోతుంది అనే నానుడి ఉంది. దీని బట్టి రథ సప్తమి నుంచి శివరాత్రి సమయం వరకూ వాతావరణ మార్పులు చాలా వేగంగా జరుగుతాయని అర్థమవుతుంది. మారుతున్న వాతావరణ నేపథ్యంలో ముఖ్యంగా ఆహార అలవాట్లల్లో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంతో పోలిస్తే ఇప్పుడు శరీరానికి తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం అవసరం. బెర్రీలు, పుచ్చకాయ, సలాడ్‌లు,కాల్చిన చేపలు, పెరుగు మొదలైన ఆహార పదార్థాలు కచ్చితంగా ఆహారంలో చేర్చుకోవాలి. పాస్తా, బంగాళదుంపలు, మైదా పిండితో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో తక్కువ క్యాలరీలు అధిక పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా ఉత్తమం. ప్రస్తుత కాలంలో పాటించాల్సిన ఆహార నియమాలపై పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో? ఓ సారి తెలుసుకుందాం.
బెర్రీలు, పుచ్చకాయలు, ఆకు కూరలు వంటి పండ్లు ఈ సీజన్‌లో అధికంగా దొరుకుతాయి. ఇవి శరీరానికి ఆర్థ్రీకరణను అందిస్తాయి.
క్వినోవా, హోల్ వీట్, బ్రౌన్ రైస్, డాలియా, జోవర్, రాగి, హోల్ వీట్ బ్రెడ్, స్థిరమైన శక్తిని అందిస్తాయి. ఈ కాలంలో వీటిని తినడం చాలా ఉత్తమం.
చికెన్, చేపలు, చిక్కుళ్ళు వంటి లీన్ ప్రోటీన్ కండరాల ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఈ ఆహారం కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది.
పెరుగు, కేఫీర్, సౌర్‌క్రాట్ వంటి పోబియోటిక్ అధికంగా ఉండే ఆహారాలు పేగు ఆరోగ్యానికి సాయం చేస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యకరమైన ప్రేగు పని తీరు కోసం సలాడ్లు, కాల్చిన మాంసాలు మరియు ఆవిరి లేదా కాల్చిన చేపలు వంటి తేలికైన సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు తప్పనిసరిగా తినాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం