గర్భిణులకు హెచ్చరిక.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే బిడ్డకి చాలా ప్రమాదం..

|

Nov 09, 2021 | 7:02 PM

Pregnant Women: ఢిల్లీ NCR సహా అనేక నగరాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కడుపులో

గర్భిణులకు హెచ్చరిక.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే బిడ్డకి చాలా ప్రమాదం..
Pregnant
Follow us on

Pregnant Women: ఢిల్లీ NCR సహా అనేక నగరాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా కాలుష్యం వల్ల చాలా ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల గర్భిణీలు తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాలి. గర్భిణీ స్త్రీలు కలుషిత వాతావరణంలో ఊపిరి పీల్చుకున్నప్పుడు ఆ కాలుష్య కణాలు శరీరంలోకి వెళ్తాయని వైద్యులు చెబుతున్నారు.

ఈ కలుషిత రేణువు పుట్టబోయే బిడ్డ ఊపిరితిత్తుల అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని అంటున్నారు. నెలలు నిండకుండానే పుట్టడం, ఆలస్యంగా పుట్టడం వంటి సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. చాలా సందర్భాలలో పిల్లవాడు ఆస్తమాతో కూడా బాధపడవచ్చని సూచిస్తున్నారు. అందుకే గర్భిణీలు కాలుష్యానికి దూరంగా ఉండటం మంచిది. తక్కువ కాలుష్యం ఉన్న ప్రదేశానికి కొన్ని రోజులు వెళ్లండి. ఇది సాధ్యం కాకపోతే ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నించండి. అనవసరంగా బయటకు రావొద్దు.

గత వారం రోజులుగా ఆస్పత్రులలో ఆస్తమా, అలర్జీ, ఊపిరి ఆడక రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మునుపటితో పోలిస్తే ఈ రోగులలో సుమారు 20 శాతం పెరుగుదల ఉంది. వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న వాయు కాలుష్యం వల్ల ఇది జరుగుతోంది. ప్రస్తుతం ఆస్తమా రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా దగ్గు సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. దీంతో అతడి ఛాతిలో ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశం కూడా ఉంది. తరువాత ఇది బ్రోన్కైటిస్ వ్యాధిగా మారుతుంది.

కాలుష్యాన్ని నివారించాలి
గదులలో తగినంత వెంటిలేషన్ సౌకర్యం ఉండాలి. ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించవచ్చు. ఇంట్లో కొన్ని రోజుల పాటు అగరబత్తీలు లేదా ఇతర వస్తువులను వెలిగించకుండా ఉండండి. ఇంటి లోపల పొగ తాగకూడదు. కొన్ని రోజులు ఉదయం, సాయంత్రం వాకింగ్‌ మానుకోండి. మాస్క్‌ తప్పనిసరిగా ధరించండి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. వేడి చేసిన నీరు తాగితే మంచిది.

Crime News: జార్ఖాండ్‌లో దారుణం.. 8 మంది పిల్లల తండ్రికి 8వ తరగతి చదివే బాలికతో వివాహం

T20 World Cup 2021: కప్ గెలవకపోయినా అతడి స్థాయి తగ్గదు.. ఈ సారి కప్ కివీస్‎దే.. వచ్చే ప్రపంచ కప్‎లో వారు రాణిస్తారు..

Crime News: పెద్దపల్లి జిల్లాలో మరో దారుణం.. ప్రేమించలేదని యువతి గొంతు కోసిన ఉన్మాది..!