తల్లిదండ్రులకు గమనిక..! పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే ఆ వ్యాధికి గురైనట్లే..?

|

Nov 20, 2021 | 6:10 AM

Childrens: ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈ వ్యాధి 40 ఏళ్ల తర్వాత మాత్రమే వస్తుందని సాధారణ ప్రజలలో ఒక నమ్మకం ఉంది కానీ అది

తల్లిదండ్రులకు గమనిక..! పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే ఆ వ్యాధికి గురైనట్లే..?
Obesity
Follow us on

Childrens: ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈ వ్యాధి 40 ఏళ్ల తర్వాత మాత్రమే వస్తుందని సాధారణ ప్రజలలో ఒక నమ్మకం ఉంది కానీ అది నిజం కాదు. ఇది చిన్న పిల్లల్లో కూడా రావచ్చు. చాలా సందర్భాలలో జన్యుపరమైన కారణాల వల్ల పిల్లలలో మధుమేహం వస్తుంది కానీ జంక్ ఫుడ్ ఎక్కువగా తినే పిల్లలకు కూడా ఈ వ్యాధి సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం తినని పిల్లలు బయట పెద్ద మొత్తంలో జంక్ ఫుడ్ తింటారు. వారికి టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది.

అయినప్పటికీ పిల్లలలో మధుమేహం చాలా తక్కువగా ఉంటుంది కానీ వారికి ఈ వ్యాధి రాదని మాత్రం చెప్పలేము. ఎందుకంటే చాలా సందర్భాలలో పిల్లలు తినే జంక్‌ ఫుడ్ కాలక్రమేణా రక్తంలో చక్కెరను అధికం చేస్తుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతారు. ఊబకాయం ఉన్న పిల్లలకు మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి పిల్లలు ఆహారంపై శ్రద్ధ చూపకపోతే వారి శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీని వల్ల మధుమేహం సమస్యగా మారుతుంది. పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల వారి శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయం బారిన పడుతారు. దీని వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు మొదలవుతాయి.

కొన్నిసార్లు ఇన్సులిన్ తగినంత పరిమాణంలో ఉత్పత్తి కాదు దీంతో చక్కెర స్థాయిలు అదుపులో ఉండవు. పిల్లలలో మధుమేహం లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు అతని చక్కెర స్థాయిని తనిఖీ చేయాలి. ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని అందించాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

ఇవి లక్షణాలు..
బరువు నష్టం, తరచుగా ఆకలి, అలసిపోవడం, శరీర గాయాలు నయం కాకపోవడం

ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి..
తెల్ల రొట్టె, అన్నం, వేయించిన జంక్ ఫుడ్, ప్యాకేజీ ఆహారం, ఎరుపు మాంసం

Kamala Harris: కమలా హారిస్‌కి అమెరికా అధ్యక్ష బాధ్యతలు.. కారణాలు ఇలా ఉన్నాయి..?

Viral Photos: ఈ తల్లి, కూతురు ఒక మాదిరిగా కనిపిస్తారు.. ఫొటోలు చూస్తే షాక్‌ అవుతారు..

IND vs NZ: రెండో మ్యాచ్‌లోనూ ఉతికారేసిన ఇండియా.. న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం..