గర్భధారణ సమయంలో, మహిళలు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో ఒకటి ఛాతి నొప్పి. సాధారణంగా కడుపు, ఊపిరితిత్తులపై ఒత్తిడి కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. పెరుగుతున్న శిశువుతో పాటు గర్భాశయం పరిణామం కూడా పెరగడం ద్వారా కడుపు, ఊపిరితిత్తులపై ఒత్తిడి మొదలవుతుంది. ఈ కారణంగా చాలామంది మహిళలు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. అలాగే ఛాతి నొప్పి కూడా వస్తుంది. అయితే ఈ ఛాతి నొప్పి గ్యాస్, యాసిడిటీ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. కారణం ఏదైనా కూడా ఛాతి నొప్పి వచ్చినప్పుడు.. దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మీకు, మీ బిడ్డకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.
– గర్భధారణ సమయంలో తరచూ బీపీని చెక్ చేసుకోవాలి. ఛాతి నొప్పి వచ్చినప్పుడు మీరు వెంటనే బీపీని చెక్ చేసుకోండి. ఒకవేళ బీపీ పెరిగినా, తగ్గినా వెంటనే డాక్టర్లను సంప్రదించండి.
– గ్యాస్ వల్ల ఛాతి నొప్పి వస్తే.. ఇంటి చిట్కాల ద్వారా ఉపశమనం పొందొచ్చు. నిమ్మకాయ, నల్ల ఉప్పును నీటిలో కలుపుకుని తాగితే కాస్త రిలీఫ్ పొందుతారు.
– గర్భాశయం పరిమాణం పెరగడం వల్ల ఛాతిలో నొప్పి వస్తే.. ప్రసవించే వరకు అది తగ్గదు. మీరు ఎక్కువగా కుడివైపున పడుకుంటే.. దానిని నుంచి ఉపశమనం పొందొచ్చు. ఒకవేళ ఇంకా నొప్పి తగ్గకపోతే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
– క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు. కొంత సమయం వాకింగ్ చేయడం, బ్యాలెన్స్‌డ్ డైట్ మైంటైన్ చేయడం మర్చిపోవద్దు.
Also Read:
దేశంలోని ఈ ఐదు ప్రదేశాల్లో లెక్కలేనన్ని నిధులు.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు..
ఈ వైరల్ ఫోటోలో పాము ఉంది.? అదెక్కడో గుర్తించండి చూద్దాం..!
రెండేళ్లుగా ఒక్క టెస్టూ ఆడలేదు.. ఇంగ్లాండ్‌లో సెంచరీ బాదేశాడు.. ఆ టీమిండియా ప్లేయర్ ఎవరంటే!