Baby Care Products: బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు..! తల్లులు మీ పిల్లలు జాగ్రత్త..

నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొందరు తల్లులు పిల్లల పెంపకంపై అతి జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. దీంతో బేబీ కేర్ కోసం ఉపయోగించే ఖరీదైన బేబీ వైప్స్ బిడ్డకు ఉపయోగిస్తుంటారు. నిజానికి ఇవి పసి పిల్లల ఆరోగ్యానికి ప్రమాదకరం అంటున్నాయి తాజా అధ్యయనాలు. ఇందులో వాడే రసాయనాలు అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయట. సువాసన, రంగు ఇవ్వడానికి బేబీ ప్రొడక్ట్స్‌లో రసాయనాలు వినియోగిస్తారు...

Baby Care Products: బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు..! తల్లులు మీ పిల్లలు జాగ్రత్త..
Baby Care Products

Updated on: Mar 29, 2024 | 1:00 PM

నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొందరు తల్లులు పిల్లల పెంపకంపై అతి జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. దీంతో బేబీ కేర్ కోసం ఉపయోగించే ఖరీదైన బేబీ వైప్స్ బిడ్డకు ఉపయోగిస్తుంటారు. నిజానికి ఇవి పసి పిల్లల ఆరోగ్యానికి ప్రమాదకరం అంటున్నాయి తాజా అధ్యయనాలు. ఇందులో వాడే రసాయనాలు అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయట. సువాసన, రంగు ఇవ్వడానికి బేబీ ప్రొడక్ట్స్‌లో రసాయనాలు వినియోగిస్తారు. ఈ రసాయనాలు చాలా హానికరమైనవి. ఇవి పసివాళ్ల శరీరంపై అనేక దుష్ర్ఫభావాలను చూపుతాయి. ఇటీవల ప్రచురించిన ఓ అధ్యయనంలో ఈ విధమైన రసాయనితు కలిసిన బేబీ ప్రొడక్ట్స్ పిల్లల్లో ఆటిజం, మల్టిపుల్ స్క్లెరోసిస్‌కు కారణమవుతున్నట్లు పరిశోధకులు అంతే కాదు, చేతులను శుభ్రపరిచేందుకు వినియోగించే హ్యాండ్‌ వాష్‌ సబ్బులు కూడా అనారోగ్యానికి గురి చేస్తున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది.

పరిశోధన ఏం చెబుతోంది?

పరిశోధన ప్రకారం.. నెయిల్ పాలిష్, బేబీ వైప్స్, హ్యాండ్ సబ్బు, క్లీనింగ్ కెమికల్స్‌లో ఎక్కువగా ఉపయోగించే ఆర్గానోఫాస్ఫేట్ ఫ్లేమ్ రిటార్డెంట్స్, క్వాటర్నరీ అమ్మోనియం కాంపౌండ్స్ వంటి రసాయనాలు మెదడు నరాలను దెబ్బతీస్తాయి. ఇవి ఆటిజం, మల్టిపుల్ స్క్లెరోసిస్ ప్రమాదాన్ని పెంచుతాయి.

నిపుణులు ఏమంటున్నారు?

చిన్న పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత, పరిశుభ్రత గురించి అధికంగా ఆందోళన చెందుతుంటారు. అందువల్లనే వారు చిన్న పిల్లలకు బేబీ వైప్‌లను ఉపయోగిస్తారు. అదేవిధంగా ప్రతి ఇంట్లో చేతులను శుభ్రం చేయడానికి హ్యాండ్ వాష్‌ సోప్‌లు ఉపయోగిస్తున్నట్లు డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. శుభ్రపరచడానికి. కానీ ఇందులో ఉండే రసాయనాలు పిల్లల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతున్నాయి. జర్నల్ ఆఫ్ నేచర్ న్యూరాలజీలో ప్రచురించబడిన పరిశోధనలో.. మతిస్థిమితం సరిగాలేని, నడవలేని పిల్లల మూత్రంలో రెండు రకాల రసాయనాల స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. అంతేకాకుండా ఈ రసాయనాలు మెదడు నిర్మాణాలను దెబ్బతీస్తాయని కూడా పరిశోధనలో తేలింది. ఇది మెదడు సరిగ్గా కమ్యూనికేట్ చేయడానికి, మెరుగ్గా పనిచేయడానికి ఆటంకం ఏర్పరుస్తుంది. ఈ దెబ్బతిన్న నరాలు పిల్లలలో ఆటిజం, మల్టిపుల్ స్క్లెరోసిస్‌కు కారణమవుతాయి.

ఇవి కూడా చదవండి

ఏ రసాయనాలు ప్రమాదకరమైనవి?

OFR, QAC అనే రెండు రకాల రసాయనాలను పరిశోధకులు గుర్తించారు. పరిశోధన ప్రకారం.. OFR సాధారణంగా వస్తువులను మండకుండా చేయడానికి ఉపయోగిస్తారు. ఫర్నిచర్, నెయిల్ పాలిష్, కార్పెట్ ఎలక్ట్రానిక్స్, డ్రైయర్ షీట్‌లలో ఇది ఎక్కువగా ఉంటుంది. QAC సూక్ష్మక్రిములను చంపడానికి ఉపయోగిస్తారు. పలు క్లీనింగ్ ఉత్పత్తులు, షాంపూలు, సన్‌స్క్రీన్‌లు, బాడీ వాష్‌లలో ఇది కనిపిస్తుంది.

ఈ గృహోపకరణాలలో వినియోగించే ఉత్పత్తులోని రసాయనాలు మెదడు నరాలను దెబ్బ తీస్తున్నాయని వైద్య నిపుణుడు డాక్టర్ పాల్ టెస్సర్ అంటున్నారు. ఆయన టీం సాధారణ గృహోపకరణాలలో కనిపించే 1,800 కంటే ఎక్కువ రసాయనాలను విశ్లేషించారు. ఇవి ఒలిగోడెండ్రోసైట్‌లు నిర్మాణాలకు హాని కలిగిస్తున్నట్లు గుర్తించారు. ఇది మెదడులోని నరాలను రక్షిస్తుంది. కావున పిల్లలకు ఈ వస్తువుల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నింయాలి. తద్వారా పిల్లలు మానసిక వ్యాధుల భారీన పడకుండా నివారించవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.