
లాభాల కోసం కొందరు వ్యాపారులు పుచ్చకాయలకు కృత్రిమ రంగును ఇంజెక్ట్ చేస్తున్నారు. దీనితో పుచ్చకాయను కోసినప్పుడు, అది పక్వానికి రాకముందే లోపల ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పైగా పుచ్చకాయ కొనేటపుడు విక్రయించేవారు దాన్ని కాస్త కట్ చేసి శాంపిల్ ఇస్తారు. చాలా మంది వాటిని తిని రుచిగా ఉన్నాయని తొందరపడి కొనేస్తుంటారు. కానీ కృత్రిమ రంగులు, రసాయనాలను ఉపయోగించి ఆకర్షణీయంగా కనిపించేలా తయారు చేసిన పుచ్చకాయ తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయ రంగు చూసి మోసపోయే ముందు ఈ కింది సింపుల్ టిప్స్ ద్వారా తేలిగ్గా కల్తీ పుచ్చకాయలను గుర్తించవచ్చు. ఎలాగంటే..
చిన్న పుచ్చకాయ ముక్కను నీటిలో కలపాలి. వెంటనే నీరు గులాబీ రంగులోకి మారుతుందో లేదో గమనించాలి. నీరు గులాబీ రంగులోకి మారితే, అది రసాయన పుచ్చకాయని అర్ధం. ఒకవేళ పండు గులాబీ రంగులోకి మారకుంటే అందులో దా కృత్రిమ రంగు కలిపలేదని అర్థం.
అలాగే పండును టిష్యూ పేపర్‌తో నొక్కి చూడవచ్చు. కాగితం ఎర్రగా మారితే, అది కల్తీ పుచ్చకాయ అని అర్థం
రంగు రావడానికి ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తాయి. వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కల్తీ పుచ్చకాయ తినడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. అలాగే రసాయనాలతో కూడిన పుచ్చకాయ తినడం వల్ల ఆకలిగా అనిపించదు. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. పుచ్చకాయ తిన్నతర్వాత అలసట, దాహంగా అనిపించడం జరుగుతుంది. రసాయనిక రంగు వేసిన పుచ్చకాయ తినడం వల్ల మూత్రపిండాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయను గుర్తించి వీటిని కొనకపోవడమే మంచిది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.