Hot Water Benefits: పరకడుపునే వేడినీళ్లను తాగితే ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే తాగకుండా ఉండలేరు..

|

Feb 01, 2023 | 7:15 AM

నిత్యం చన్నీళ్లను తాగడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు కంటే కీడే ఎక్కువ. చల్లని నీరు అనేక వ్యాధులకు ఆహ్వానం పలుకుతాయి. అందుకే వైద్యులు..

Hot Water Benefits: పరకడుపునే వేడినీళ్లను తాగితే ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే తాగకుండా ఉండలేరు..
Benefits with Hot Water
Follow us on

మన దేశంలో అమలులో ఉన్న వివిధ ఆహార అలవాట్ల కారణంగా ఎవరికి నచ్చిన ఆహారాన్ని వారు ఇష్టంగా తింటుంటారు. అందులో భాగంగానే చాలా మంది చల్లగా.. చిల్‌గా ఉండే ఫ్రిజ్ వాటర్ తాగేందుకే ఇష్టపడతారు. మరి కొందరు వేడి నీళ్లను తాగేందుకు ఎంచుకుంటారు. అయితే నిత్యం చన్నీళ్లను తాగడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు కంటే కీడే ఎక్కువ. చల్లని నీరు అనేక వ్యాధులకు ఆహ్వానం పలుకుతాయి. అందుకే వైద్యులు నార్మల్ వాటర్ తాగడం మంచిదని చెబుతారు. నీరు తాగమన్నారు కదా అని చల్లని నీరు మాత్రం తాగకూడదు. వీలైతే కాచి చల్లార్చిన గోరు వెచ్చని నీటిని తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ముఖ్యంగా ఉదయం వేళల్లో చాలా మందికి టీ కాఫీలు, లేదా చల్లని నీళ్లను తాగే అలవాటు ఉంటుంది. దీనికి తగినంత దూరంగా ఉండడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం వేళలో లేవగానే, ముఖ్యంగా చలికాలంలో ఉదయాన్నే వేడి నీళ్లను తాగడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు మనం తెలుుసుకుందాం..

ఉదయం నిద్రలేవగానే.. లేదా కాలకృత్యాలు తీర్చుకోడానికి ముందే 2 లేదా 3 గ్లాసుల గోరు వెచ్చని నీరు తాగండి. నీటిని వేగంగా తాగేయకుండా.. నోటిలోనే ఉంచుకుంటూ గుటకలు వేస్తూ తాగండి. రోజూ ఉదయం నిద్రలేవగానే వేడి నీళ్లు తాగడం వలన చాలా వరకూ బరువు తగ్గుతారు. అంతేకాక మీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజన్స్‏లో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి వేడినీరు మన శరీరాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా.. ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం వలన రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చాలామంది బరువు తగ్గడానికి వేడి నీళ్లు తాగుతారు. అయితే ఉదయంతో పాటు రాత్రిళ్లు కూడా వేడి నీళ్లు తాగితే సులభంగా బరువు తగ్గుతారు.

కాగా నిత్యం క్రమం తప్పకుండా వేడినీళ్లను తాగడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరుగుతుంది. ఉబకాయం, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు వేడి నీరు తాగడం చాలా మంచిది. అంతేకాక వేడినీరు తాగడం వలన అజీర్థి సమస్యలు తొలగిపోవడమే కాక జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి కడుపులో నుంచి బయటకు వచ్చే జీర్ణరసాల స్రావాన్ని వేడి నీరు పెంచుతుంది. ఫలితంగా శరీరంలో గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తగ్గడమే కాక మలబద్ధకం సమస్యకు దూరంగా ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.