Uber via WhatsApp: ఇకపై వాట్సాప్ ద్వారా కూడా ఊబర్ రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు.. అది ఎలాగో తెలుసుకుందాం రండి..

|

Dec 27, 2022 | 8:26 PM

ఊబర్ కంపెనీతో వాట్సాప్ టైయప్ అయ్యి ఊబర్ సేవలను మరింత సులభతరం  చేసింది. ప్రస్తుతానికి ఈ సర్వీస్ ఢిల్లీ, లక్నో నగరాలలో అమలవుతోంది. ఈ ప్రాంతాలలో వాట్సాప్ వినియోగదారులు కేవలం..

Uber via WhatsApp: ఇకపై వాట్సాప్ ద్వారా కూడా ఊబర్ రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు.. అది ఎలాగో తెలుసుకుందాం రండి..
Book Uber Via Whatsapp
Follow us on

క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కారణంగా మానవ జీవిన విధానం మరింత సుఖప్రదంగా ముందుకు సాగుతోంది. సొంతంగా బైక్ లేదా కార్ లేనివారికి ఊబర్, రాపిడో వంటి వాహాన సేవలందించే కంపెనీలు ఎంతగానో సహకరిస్తున్నాయి. ఇక వాట్సాప్ గురించి మీ అందరికీ తెలిసిందే. వేగవంతమైన మెసెంజర్‌గా ఉపయోగపడే వాట్సాప్ కొంత కాలం ముందే డిజిటల్ లావాదేవీలలోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే తాజాగా ఊబర్ కంపెనీతో వాట్సాప్ టైయప్ అయ్యి ఊబర్ సేవలను మరింత సులభతరం  చేసింది. ప్రస్తుతానికి ఈ సర్వీస్ ఢిల్లీ, లక్నో నగరాలలో అమలవుతోంది. ఈ ప్రాంతాలలో వాట్సాప్ వినియోగదారులు కేవలం ఊబర్ మొబైల్ నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా Uber రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు.

ఇంగ్లీష్, హిందీ భాషలలో వినియోగదారులు ఈ రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ సేవలను దేశమంతటా అందించే అవకాశం ఉంది. ఒక వేళ త్వరలోనే మీ నగరంలోనూ ఈ సేవలు ప్రారంభమయితే.. వాట్సాప్ ద్వారా ఊబర్ రైడ్‌ను ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Step 1- వాట్సాప్ ద్వారా ఉబర్ రైడ్ బుక్ చేసుకోవాలనుకుంటే.. ఉబర్ అఫీషియల్ నంబర్ +91 7292000002 ను మీ ఫోన్ కాంటాక్ట్స్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

Step 2- ఈ నంబర్‌ను సేవ్ చేసుకున్న తర్వాత చాట్స్‌లోకి వెళ్లి ఉబర్ చాట్‌బాట్‌తో (Uber chatbot) చాట్ చేయొచ్చు. ఇదే కాకుండా.. http://wa.me/917292000002 లోకి వెళ్లి కూడా చాట్ చేసే అవకాశం ఉంటుంది.

Step 3- చాట్‌లో Hi అని ఆ నంబర్‌కు మెసేజ్ చేయాలి.

tep 4 – మీ పికప్ అడ్రస్, డెస్టినేషన్ పాయింట్స్‌ను అంటే క్యాబ్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లాలి..? వంటి వివరాలను తెలపాలి. మీరు పిక్‌అప్ కోసం లైవ్ లొకేషన్‌ను కూడా షేర్ చేయొచ్చు.

Step 6 – తర్వాత రైడ్‌ను కన్ఫర్మ్ చేసి.. రైడ్‌ను యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది.

దగ్గర్లో ఉన్న ఊబర్ డ్రైవర్ మీ రైడ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసిన తర్వాత.. ఉబర్ మీకు నోటిఫికేషన్ పంపిస్తుంది. స్టేటస్ అప్‌డేట్స్‌ను కూడా పంపించేందుకు వాట్సాప్ ఉపకరిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..