పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తప్పనిసరి..? ఎన్ని లాభాలో తెలిస్తే..

వీటిలో అధిక మొత్తంలో యాంటీబాడీలు ఉంటాయని చెబుతున్నారు. ఇది హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి శిశువును కాపాడుతుంది. ఇవి శిశువు పెరుగుదల, అభివృద్ధికి చాలా అవసరం అంటున్నారు. పసి పిల్లలకు తొలుత పట్టించే ముర్రుపాలు తక్కువ కొవ్వు కలిగి ఉంటుంది.. శిశువుకు సులభంగా జీర్ణమవుతాయి. ముర్రుపాలు శిశువు, తల్లి మధ్య బలమైన బంధాన్ని ఏర్పరచడానికి సహాయపడతాయి. అందుకే ప్రతి తల్లి పుట్టిన వెంటనే తన బిడ్డకు ముర్రుపాలు పట్టించడం చాలా ముఖ్యం అంటున్నారు వైద్యులు.

పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తప్పనిసరి..? ఎన్ని లాభాలో తెలిస్తే..
Breast Milk For Baby

Updated on: May 02, 2025 | 1:01 PM

పుట్టిన బిడ్డకు ముర్రుపాలు దగ్గరినుంచి వీలైనంత వరకు అమ్మపాలు తప్పనిసరిగా తాగించాలని పెద్దలు, వైద్యులు తరచూ చెబుతూనే ఉంటారు. పుట్టిన పిల్లలకు ముర్రుపాలు తాగించటం వల్ల మేధోశక్తి పెరుగుతుందని అనేక అధ్యయనాలు తేల్చాయి. మొదటి పాలు నవజాత శిశువుకు ఒక అమూల్యమైన వరంగా చెబుతున్నారు.. పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టించడం వల్ల ఊహించని లాభాలు లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అమ్మపాలు తాగేవారిలో మేధోశక్తి కూడా అధికంగా ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. చిన్నప్పుడు వీలైనంత ఎక్కువకాలం అమ్మపాలు తాగిన వారిలో తెలివితేటలు కూడా ఎక్కువని తేలింది. సాధారణ పాల కంటే ముర్రుపాలలో భిన్నమైన పోషక విలువలను కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో అధిక మొత్తంలో యాంటీబాడీలు ఉంటాయని చెబుతున్నారు. ఇది హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి శిశువును కాపాడుతుంది. ఇవి శిశువు పెరుగుదల, అభివృద్ధికి చాలా అవసరం అంటున్నారు.

పసి పిల్లలకు తొలుత పట్టించే ముర్రుపాలు తక్కువ కొవ్వు కలిగి ఉంటుంది.. శిశువుకు సులభంగా జీర్ణమవుతాయి. ముర్రుపాలు శిశువు, తల్లి మధ్య బలమైన బంధాన్ని ఏర్పరచడానికి సహాయపడతాయి. అందుకే ప్రతి తల్లి పుట్టిన వెంటనే తన బిడ్డకు ముర్రుపాలు పట్టించడం చాలా ముఖ్యం అంటున్నారు వైద్యులు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..