Kakarakaya Oil: కాకరకాయ ఆయిల్‌తో హెయిర్ ఫాల్ సమస్యకు చెక్..

|

Sep 12, 2024 | 2:28 PM

ఆయిల్స్‌లో చాలా రకాలు ఉంటాయి. వంటకు ఉపయోగించే నూనెలు, జుట్టుకు వాడే ఆయిల్, చర్మ సమస్యలకు ఆయిల్స్.. ఇలా చాలా రకాలు ఉంటాయి. సమస్యలను బట్టి నూనెల ఉపయోగిం ఉంటుంది. వీటిల్లో కాకరకాయ ఆయిల్ కూడా ఒకటి. చాలా మందికి ఈ ఆయిల్ గురించి తెలీదు. కరేలా ఆయిల్ అంటే కాకరకాయ నుంచి తీసిన నూనె. ఆ నూనెను ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. కరేలా ఆయిల్‌లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు..

Kakarakaya Oil: కాకరకాయ ఆయిల్‌తో హెయిర్ ఫాల్ సమస్యకు చెక్..
Kakarakaya Oil
Follow us on

ఆయిల్స్‌లో చాలా రకాలు ఉంటాయి. వంటకు ఉపయోగించే నూనెలు, జుట్టుకు వాడే ఆయిల్, చర్మ సమస్యలకు ఆయిల్స్.. ఇలా చాలా రకాలు ఉంటాయి. సమస్యలను బట్టి నూనెల ఉపయోగిం ఉంటుంది. వీటిల్లో కాకరకాయ ఆయిల్ కూడా ఒకటి. చాలా మందికి ఈ ఆయిల్ గురించి తెలీదు. కరేలా ఆయిల్ అంటే కాకరకాయ నుంచి తీసిన నూనె. ఆ నూనెను ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. కరేలా ఆయిల్‌లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు లభిస్తాయి. ఈ కరేలా ఆయిల్‌తో చర్మం, జుట్టు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఇంకా కరేలా ఆయిల్‌తో ఎలాంటి లాభాలు ఉన్నాయి? ఏ సమస్యలను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టుకు రాయడం వలన..

కాకరకాయ ఆయిల్‌ని జుట్టుకు రాయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. జుట్టు ఒత్తుగా, బలంగా ఉండాలి అనుకునేవారు ఈ నూనెను ఉపయోగించవచ్చు. ఈ నూనె రాయడం వల్ల బలహీనంగా ఉండే జుట్టు బలపడుతుంది. తలపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. ఈ నూనెలో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రు సమస్యలతో బాధ పడేవారికి ఎంతో సహాయ పడతాయి. తరచూ ఈ ఆయిల్ తలకు రాయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా ఉంటాయి.

చర్మానికి రాయడం వలన..

కరేలా ఆయిల్ చర్మానికి కూడా ఉపయోగించవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలను తగ్గించడంలో సహాయ పడుతుంది. చర్మం ఉండే మృత కణాలను తగ్గించి.. మెరిచేలా చేస్తుంది. చర్మం హైడ్రేట్‌గా ఉండేలా చేయడంలో సహాయ పడుతుంది. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఆయిల్‌‌ని నేరుగా అయినా వంట రూపంలో కూడా తీసుకోవచ్చు. ఈ నూనె వాడటం వల్ల డయాబెటీస్ సమస్యతో బాధ పడేవారికి మంచి ఉపశమనం ఉంటుంది. అలాగే కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కాలేయ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..