AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: మీరు సక్సెస్ కావాలా బ్రో.. ఈ భయాలను వదిలేస్తే విజయం మీకు దాసోహం..!

Chanakya Neeti: జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విషయం గురించి భయాలు ఉంటాయి. వీటిలో కొన్నింటికి భయపడితే జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేమని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. కాబట్టి, విజయానికి ఆటంకం కలిగించే ఆ భయాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Chanakya Niti: మీరు సక్సెస్ కావాలా బ్రో.. ఈ భయాలను వదిలేస్తే విజయం మీకు దాసోహం..!
Chanakya Niti
Rajashekher G
|

Updated on: Jan 22, 2026 | 4:51 PM

Share

విజయం సాధించాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ, అందుకు తగినట్లుగా ప్రయత్నం మాత్రం ఉండదు. దీంతో అందరూ విజయం సాధించలేరు. చివరి వరకు పోరాడే వ్యక్తులకు మాత్రమే విజయం దక్కుతుంది. నిరంతర శ్రమ, ఆ దిశగా ప్రతి అడుగు వేయడంతోనే విజయం లభ్యమవుతుంది. విజయం సాధించాలనుకునేవారు కొన్ని తప్పలు చేస్తే లేదా కొన్నింటికి భయపడితే తమ జీవితంలో విజయం సాధించలేరని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. విజయం సాధించాలనుకునే వారు ఆ భయాన్ని విడిచిపెట్టాలని ఆచార్య చాణక్యుడు స్పష్టం చేస్తున్నారు. జీవితంలో విజయం సాధించాలంటే ఎలాంటి భయాలకు లోనుకాకూడదని అంటున్నారు. కాబట్టి, విజయానికి ఆటంకం కలిగించే ఆ భయాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ నాలుగు విషయాలకు భయపడకూడదు:

నిజం చెప్పడానికి భయపడొద్దు

ప్రజలు తమ తప్పులను దాచుకోవడానికి అబద్ధాలు చెబుతారు. తప్పులు జరిగినప్పుడు నిజం చెప్పడానికి భయపడతారు. కానీ, చాణక్యుడు ఏ విధంగానైనా నిజం చెప్పడానికి భయపడకూడదని స్పష్టం చేశారు. నిజం చెప్పడం ఒక వ్యక్తికి ఉన్న గొప్ప బలం. నిజం చెప్పడం ద్వారా, ఒక వ్యక్తి అందరి నమ్మకాన్ని పొందుతాడు.. సమాజంలో మంచి ఇమేజ్‌ను సృష్టిస్తాడు, పురోగతిని సాధిస్తాడు. కాబట్టి నిజం చెప్పడానికి వెనుకాడవద్దని సూచించారు.

కష్టపడి పనిచేయడానికి భయపడొద్దు

చాలా మంది కష్టపడకుండానే సులభంగా విజయం సాధించాలని కోరుకుంటారు. కష్టపడి పనిచేయకుండా జీవితంలో ఏ లక్ష్యాన్ని సాధించలేము. కష్టపడి పనిచేయడానికి భయపడకండి. జీవితంలో విజయం సాధించాలనుకుంటే.. కష్టపడి పనిచేయండి. కష్టపడి పనిచేయడం ఒక వ్యక్తిని బలపరుస్తుంది, అతన్ని విజయవంతం చేస్తుంది అని చాణక్యుడు స్పష్టం చేశారు.

మార్పులకు భయపడొద్దు

ఒక వ్యక్తి జీవితంలో మార్పును అంగీకరించాలి. మార్పుకు భయపడేవారు జీవితంలో ఏమీ సాధించలేరు. జీవితంలో వచ్చే మార్పులను అంగీకరించండి. మార్పుతో కొత్త జీవితాన్ని గడపాలి, అప్పుడే విజయం సాధించగలమని చాణక్యుడు తేల్చిచెప్పారు.

పోరాటాలకు భయపడొద్దు

జీవితమే ఒక పోరాటం. జీవితంలో వచ్చే పోరాటాలు ఒక వ్యక్తిని బలోపేతం చేస్తాయి. ఆ పోరాటాలు మనకు సహనం, జీవిత పాఠాలను నేర్పుతాయి. జీవితంలోని పోరాటాలు మనకు ఎలా ముందుకు సాగాలో నేర్పుతాయని చాణక్యుడు చెప్పారు. జీవితంలో ఎదుర్కొనే పోరాటాలకు భయపడేవారు జీవితంలో విజయం సాధించలేరు. అందుకే జీవితంలో ఎదురయ్యే సమస్యలపై పోరాడుతూ విజయం సాధించాలని సూచించారు.