Sudden Headache: టీ, కాఫీ తాగితే నిజంగానే తల నొప్పి తగ్గుతుందా? దీని వెనుక అసలు రహస్యం ఇదే..

తలనొప్పి తీవ్రతను భరించలేని వారు కొందరు మందులను ఆశ్రయిస్తారు. మరికొంతమంది ఈ అసౌకర్యాన్ని తగ్గించడానికి కప్పు వేడివేడి టీ లేదా కాఫీ తాగుతారు. కానీ ఈ రకమైన అలవాటు నిజంగా తలనొప్పిని తగ్గిస్తుందా? ఇందులో ఎంత నిజం ఉంది? టీ లేదా కాఫీ తాగితే మనకు నిజంగానే రిలాక్స్‌గా..

Sudden Headache: టీ, కాఫీ తాగితే నిజంగానే తల నొప్పి తగ్గుతుందా? దీని వెనుక అసలు రహస్యం ఇదే..
Tea For Sudden Headache

Updated on: Mar 29, 2025 | 1:01 PM

తలనొప్పి ఎప్పుడైనా రావచ్చు. ఒక్కోసారి ఆకస్మికంగా తలనొప్పి వస్తుంది. దీంతో తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ నొప్పి తీవ్రతను భరించలేని వారు కొందరు మందులను ఆశ్రయిస్తారు. మరికొంతమంది ఈ అసౌకర్యాన్ని తగ్గించడానికి కప్పు వేడివేడి టీ లేదా కాఫీ తాగుతారు. కానీ ఈ రకమైన అలవాటు నిజంగా తలనొప్పిని తగ్గిస్తుందా? ఇందులో ఎంత నిజం ఉంది? టీ లేదా కాఫీ తాగితే మనకు నిజంగానే రిలాక్స్‌గా అనిపిస్తుందా? దీని గురించి వైద్యులు ఏమి చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

టీ లేదా కాఫీ నిజంగా తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందా? లేదా నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుందా? అనే దానికి ప్రముఖ పోషకాహార నిపుణుడు సెజల్ అహుజా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టీ లేదా కాఫీలోని కెఫిన్ రక్త నాళాలను సంకోచించడం ద్వారా తాత్కాలిక నొప్పి నివారణను అందిస్తుంది. కానీ దీర్ఘకాలంలో ఇది తలనొప్పిని మరింత తీవ్రతరం చేస్తుందని అంటున్నారు.

కెఫీన్‌తో డీహైడ్రేషన్‌

ఒత్తిడి, ఆందోళన, నిర్జలీకరణం లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల తలనొప్పి సంభవించవచ్చు. తలనొప్పి సాధారణంగా డీహైడ్రేషన్ వల్ల వస్తుంది. టీ లేదా కాఫీ తాగడం వల్ల శరీర పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ఎందుకంటే కెఫిన్ కూడా డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. కాబట్టి టీ లేదా కాఫీ తాగడం వల్ల తక్షణ శక్తి, ఉపశమనం అనుభూతి చెందినప్పటికీ తలనొప్పి మళ్లీ పునరావృతమవుతుంది.

ఇవి కూడా చదవండి

తలనొప్పి తగ్గడానికి పనికొచ్చే కొన్ని చిట్కాలు

సాధారణంగా తలనొప్పిని నివారించడానికి టీ లేదా కాఫీని ప్రత్యామ్నాయంగా తీసుకునే బదులు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం మంచిది. శరీరానికి పుష్కలంగా నీరు లేదా ఇతర హైడ్రేటింగ్ ఆహారాలు ఇవ్వడానికి ప్రయత్నించాలి. బదులుగా అల్లం టీ, గ్రీన్ టీ లేదా జ్యూస్ వంటి ఆరోగ్యకరమైన పానీయాలు తాగాలి. ఇవి టీలలో మంచి ఎంపికలు. అలాగే ఒక చిన్న డార్క్ చాక్లెట్ ముక్క తీసుకున్నా కూడా తలనొప్పి లక్షణాల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. కానీ నొప్పి భరించలేనంతగా ఉంటే వెంటనే ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించాలి.

రోజుకు ఎంత పరిమాణంలో టీ లేదా కాఫీ తాగాలి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పెద్దలకు రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫిన్ (సుమారు 4 కప్పుల కాఫీ లేదా 8 కప్పుల టీ) సురక్షితం. అయితే తరచుగా తలనొప్పి వచ్చేవారు దీని నుంచి ఉపశమనం పొందడానికి టీ లేదా కాఫీ తాగుతుంటే కెఫిన్ మోతాదును తగ్గించడం మంచిది. కెఫీన్ త్వరగా ఉపశమనం కలిగించగలిగినప్పటికీ, దానిపై అతిగా ఆధారపడటం మంచిది కాదు. తలనొప్పిని నయం చేసుకోవడానికి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం ఎల్లప్పుడూ మేలు చేస్తుంది.

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.