Medication: విటమిన్‌ సప్లిమెంట్లను వీటితో కలిపి తీసుకున్నారంటే కథ కంచికే! బీకేర్ ఫుల్..

చాలా మంది విటమిన్ల లోపాన్ని భర్తీ చేయడానికి మల్టీవిటమిన్లు లేదా ఇతర సప్లిమెంట్లను తీసుకుంటూ ఉంటారు. అయితే కొందరు తెలియకుండానే విటమిన్‌ సప్లిమెంట్లను ఇతర మందులతో కలిపి తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చని అంటున్నారు..

Medication: విటమిన్‌ సప్లిమెంట్లను వీటితో కలిపి తీసుకున్నారంటే కథ కంచికే! బీకేర్ ఫుల్..
Vitamin Supplements

Updated on: Jun 15, 2025 | 1:51 PM

విటమిన్లు మన శరీరానికి చాలా అవసరం. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, శరీరం ఆరోగ్యంగా పనిచేయడానికి కూడా సహాయపడతాయి. చాలా మంది విటమిన్ల లోపాన్ని భర్తీ చేయడానికి మల్టీవిటమిన్లు లేదా ఇతర సప్లిమెంట్లను తీసుకుంటూ ఉంటారు. అయితే కొందరు తెలియకుండానే విటమిన్‌ సప్లిమెంట్లను ఇతర మందులతో కలిపి తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చని అంటున్నారు. ఏ మందులు, విటమిన్లను కలిపి తీసుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

విటమిన్లు, ఔషధాల మధ్య జరిగే రసాయన ప్రతిచర్యలు శరీరంలో అనేక సమస్యలను కలిగిస్తాయి. కొన్ని విటమిన్లు మెడిసిన్‌ ప్రభావాన్ని తగ్గిస్తాయి లేదంటే పెంచుతాయి. దీని కారణంగా మెడిసిన్‌ దాని ప్రభావాన్ని సక్రమంగా చూపడంలో విఫలం అవుతుంది. ఇది శరీరంపై వివిధ ప్రభావాలను చూపుతుంది. కొన్ని సమ్మేళనాలు కాలేయం, మూత్రపిండాలను అవసరమైన దానికంటే ఎక్కువగా పని చేయమని బలవంతం చేస్తాయి. దీంతో ఆయా అవయవాలను దెబ్బతీస్తాయి.

ఇవి కూడా చదవండి

ఏ మందులు, విటమిన్ సప్లిమెంట్లతో కలిపి తీసుకోకూడదంటూ..?

  • ముఖ్యంగా విటమిన్ E, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి కొన్ని సప్లిమెంట్లు గుండె సంబంధిత మందులతో కలిపి తీసుకున్నప్పుడు రక్తపోటు అసమతుల్యతకు కారణమవుతాయి.
  • రక్తాన్ని పలుచబరిచే మందులతో విటమిన్ కె ట్యాబ్లట్లు తీసుకోకూడదు. విటమిన్ K రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. అయితే రక్తాన్ని పలుచబరిచే మందులు వీటితో తీసుకుంటే అవి రక్తాన్ని మరింత పలుచగా చేస్తాయి. రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల మందుల ప్రభావం తగ్గుతుంది.
  • యాంటీబయాటిక్స్ + ఐరన్/కాల్షియం సప్లిమెంట్లు కలిపి తీసుకోకూడదు. ఐరన్, కాల్షియం యాంటీబయాటిక్స్‌ను శరీరం పూర్తిగా గ్రహించడానికి అనుమతించవు. అందుకే ఇన్ఫెక్షన్ నయం కాదు.
  • డయాబెటిస్ మందులు + విటమిన్ B3 మందులు కలిపి తీసుకోకూడదు. విటమిన్ B3 శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇది డయాబెటిస్ మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
  • యాంటాసిడ్లు + ఐరన్ సప్లిమెంట్లు కూడా కలిపి తీసుకోకూడదు. యాంటాసిడ్లు ఐరన్‌ శోషణను తగ్గిస్తాయి. ఇది రక్తహీనత, బలహీనతకు కారణమవుతుంది.
  • కాబట్టి వైద్యుడిని సంప్రదించకుండా ఎప్పుడూ మందులు, సప్లిమెంట్లను కలిపి తీసుకోకూడదు. ముఖ్యంగా మల్టీవిటమిన్లు తీసుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు రక్త పరీక్ష చేయించుకోవడం మంచిది. మందులు, విటమిన్‌ సప్లిమెంట్లకు మధ్య కనీసం 2 గంటల విరామం తీసుకోవాలి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.