పసిబిడ్డలకు పాలు పట్టించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..!
పసిబిడ్డలకు తల్లిపాలు పట్టించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన పద్ధతిలో పాలు ఇవ్వకపోతే బేబీకి శ్వాస సమస్యలు, జీర్ణ సమస్యలు రావచ్చు. తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి అమూల్యం. కాబట్టి ప్రతి తల్లి సరైన పొజిషన్, శుభ్రత, పోషకాహారం పాటిస్తూ పాలు పట్టించడం అవసరం.

పసిబిడ్డలకు పాలు పట్టించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు పాలు గొంతులో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే.. ప్రతి తల్లి ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం.
తల్లిపాల ఇంపార్టెన్స్
తల్లిపాలలో బేబీ గ్రోత్ కి కావాల్సిన ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, యాంటీబాడీస్ అన్నీ ఉంటాయి. పుట్టిన వెంటనే వచ్చే మొదటి పాలు (కొలొస్ట్రమ్) బేబీ ఇమ్యూనిటీని పెంచి, వ్యాధుల నుంచి కాపాడతాయి. డాక్టర్స్ చెబుతున్నదాని ప్రకారం.. మినిమమ్ ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు ఇవ్వాలి. ఆ తర్వాత రెండేళ్ల వయసు వరకు కూడా కొనసాగించవచ్చు.
కరెక్ట్ పొజిషన్‌లో పాలివ్వడం
పాలిచ్చేటప్పుడు బేబీని ఎలా పట్టుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. కూర్చుని పాలివ్వడం సేఫ్. పడుకుని పాలు ఇస్తే బేబీకి సరిగా అందకపోవచ్చు. తల్లి కంఫర్టబుల్ గా కూర్చుని దిండుకు ఆనుకోవాలి. బేబీ నోటిలో నిపుల్ మాత్రమే కాకుండా.. దాని చుట్టూ ఉన్న బ్రౌన్ ఏరియా కూడా ఉండేలా చూసుకోవాలి. ఒక వైపు పూర్తిగా పాలు ఇచ్చాక.. తర్వాత మరో వైపు ఇవ్వడం బెస్ట్.
తప్పకుండా ఫాలో అవ్వాల్సిన టిప్స్
- బేబీ నిద్రపోతున్నప్పుడు అస్సలు పాలివ్వకూడదు.
- పాలు పట్టించిన తర్వాత బేబీని భుజంపై వేసుకుని నెమ్మదిగా వీపుపై తట్టాలి. దీని వల్ల లోపలికి వెళ్లిన గాలి తేన్పు (బర్ప్) ద్వారా బయటకు వస్తుంది. ఇది పాలు గొంతులో అడ్డుకోకుండా హెల్ప్ చేస్తుంది.
- బేబీ ప్రాపర్ గా బ్రీత్ చేస్తుందో లేదో ఎప్పుడూ చెక్ చేస్తూ ఉండాలి.
- బేబీకి సరిపడా తల్లిపాలు ఇస్తుంటే.. ఎక్స్‌ట్రాగా వాటర్ ఇవ్వాల్సిన పనిలేదు.
- పాలిచ్చే తల్లి తగినన్ని నీళ్లు తాగడం, హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. పప్పులు, ఆకుకూరలు, ఫైబర్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తినాలి.
- తల్లి మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటేనే పాలు బాగా పడతాయి. అందుకే ప్రశాంతమైన వాతావరణం ముఖ్యం.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా ప్రాబ్లమ్స్ వస్తే.. వెంటనే డాక్టర్‌ను కన్సల్ట్ అవ్వడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
