Health Tips: బ్రేక్‌ఫాస్ట్‌లో మరిచిపోయి కూడా ఈ పదార్థాలు తినకండి.. ఆ ప్రమాదం పెరుగుతుందట జాగ్రత్త..

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది అధికబరువుతో పోరాడుతున్నారు. ఊబకాయం వల్ల పలు వ్యాధుల ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంపై దృష్టిపెట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు.

Health Tips: బ్రేక్‌ఫాస్ట్‌లో మరిచిపోయి కూడా ఈ పదార్థాలు తినకండి.. ఆ ప్రమాదం పెరుగుతుందట జాగ్రత్త..
Breakfast

Updated on: Nov 02, 2022 | 9:55 PM

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది అధికబరువుతో పోరాడుతున్నారు. ఊబకాయం వల్ల పలు వ్యాధుల ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంపై దృష్టిపెట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అల్పాహారం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. బ్రేక్‌పాస్ట్‌ అనేది రోజులో మనం తినే మొదటి ఆహారం.. అయితే, ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం వల్ల బరువు ఈజీగా తగ్గుతుందని పేర్కొంటున్నారు. బ్రేక్‌పాస్ట్ ఊబకాయులకు సహాయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఉదయం నిద్రలేచిన 3 గంటలలోపు అల్పాహారం తీసుకోవాలి. అదే సమయంలో కొంతమంది డైటింగ్ నేపథ్యంలో అల్పాహారం మానేస్తారు. అయితే ఇలా చేయడం వల్ల శరీరానికి అస్సలు మంచిది కాదని.. దీంతో కూడా బరువు పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఇదే కాకుండా, ఉదయం అల్పాహారంంలో కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాంటివి తీసుకుంటే బరువు వేగంగా పెరుగుతుందని పేర్కొంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఎలాంటి పదార్థాలు తినకూడదు?.. ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తింటే బరువు పెరుగుతారు..

జ్యూస్ః చాలా మంది బరువు తగ్గడానికి బ్రేక్‌ఫాస్ట్‌లో జ్యూస్ తాగుతారు. ఎందుకంటే చాలా మంది జ్యూస్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని.. బరువు తగ్గించడంలో సహాయపడుతుందని భావిస్తారు. కానీ, మార్కెట్ జ్యూస్ తీసుకుంటే కచ్చితంగా బరువు పెరుగుతుంది. ఎందుకంటే ప్యాక్ చేసిన జ్యూస్‌లలో చాలా చక్కెర ఉంటుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అందువల్ల, బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు అల్పాహారంలో ఆరోగ్యకరమైన వాటిని తీసుకుంటే అది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. మరోవైపు, మీరు బరువు తగ్గాలనుకుంటే, బ్రేక్ ఫాస్ట్‌లో బ్రెడ్, పరాటాలు తీసుకోకుండా ఉండండి.

బిస్కెట్లుః అల్పాహారంలో ఒక కప్పు టీతో పాటు బిస్కెట్లు తింటే మీ బరువు పెరగదని భావిస్తుంటే.. ఇప్పటినుంచే ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మార్కెట్‌లో లభించే డైజెస్టివ్ బిస్కెట్లలో మీ ఆరోగ్యానికి హాని కలిగించే కేలరీలు, చక్కెరలు ఉంటాయి. దీంతోపాటు అల్పాహారంలో బిస్కెట్లు తింటే బరువు కూడా వేగంగా పెరుగుతుంది. బరువు తగ్గాలనుకుంటే అల్పాహారంలో బిస్కెట్లు తినడం మానుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పరాటాః చాలా మంది అల్పాహారంగా పరాటా తినడానికి ఇష్టపడతారు. కానీ అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. దీన్ని తీసుకోవడం వల్ల మీ బరువు పెరుగుతుంది. స్లిమ్‌గా ఉండాలనుకుంటే పరాఠాను తినకూడదని.. ఆయిల్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..