
తెల్లవారుజామున నిద్రలేవడం మంచిదని ప్రతి ఇంట్లో పెద్దోళ్లు చెబుతుంటారు. ఈ ఆచారం శారీరక, మానసిక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఇతర పనులకు కూడా మంచిదట. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. హిందూ మతంలో బ్రహ్మ ముహూర్తాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఉదయం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు సమయాన్ని బ్రహ్మ ముహూర్తంగా పరిగణిస్తారు. ఈ సమయంలో మేల్కొనడం వల్ల బలం, జ్ఞానం, ఆరోగ్యం లభిస్తాయని నమ్ముతారు. కాబట్టి ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
మత విశ్వాసాల ప్రకారం బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో మేల్కొనే వ్యక్తిని దేవతలు ఆశీర్వదిస్తారు. ఇంకా బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కొనే అలవాటే జీవితంలో అపారమైన విజయాన్ని తీసుకురావడానికి సహాయపడుతుందని నమ్మకం.
శాస్త్రీయ దృక్కోణంలో చూస్తే.. బ్రహ్మ ముహూర్తంలో అధిక స్థాయిలో ఆక్సిజన్, తక్కువ స్థాయిలో కాలుష్యం ఉంటుంది. ఈ వాతావరణం శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మానసిక స్పష్టత, ఒత్తిడి నుంచి ఉపశమనం, బలమైన రోగనిరోధక వ్యవస్థ వంటి ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కొనడం వల్ల శరీర సిర్కాడియన్ లయను నియంత్రిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది.
బ్రహ్మ ముహూర్త సమయంలో గాలి ఆక్సిజన్‌తో సమృద్ధిగా ఉంటుంది. ఈ తాజా గాలి శరీరాన్ని ఉల్లాసపరిచి శక్తినిస్తుంది. ఇది రోజులోని అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది.
బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కొనడం వల్ల నిద్ర విధానాలు క్రమబద్ధీకరించబడతాయి. ఇది నిద్రలేమిని తగ్గిస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
బ్రహ్మ ముహూర్త సమయంలో క్రమం తప్పకుండా మేల్కొనడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ సమయంలో వాతావరణం స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బ్రహ్మ ముహూర్త సమయంలో వాతావరణం ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉంటుంది, ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి వీలు కల్పిస్తుంది. అలాగే ఈ సమయం ధ్యానం, యోగా, ప్రాణాయామం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.