Winter Immunity: తరచూ వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారా?.. ఈ ఒక్క డ్రింక్‌తో క్షణాల్లో చెక్ ‌పెట్టండి!

చలికాలంలో మన శరీరంలో రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. తర్వాత తరచూ మనం వైరల్‌ జ్వారాల భారీన పడుతుంటాం. అయితే ఈ సీజన్ వ్యాధులను ఎదుర్కొని మనం ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుకొని ఈ వ్యాధులకు చెక్‌ పెట్టేందుకు ఆరోగ్య నిపుణులు కొంటి ఇంటి చిట్కాలను తెలియజేశారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Winter Immunity: తరచూ వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారా?.. ఈ ఒక్క డ్రింక్‌తో క్షణాల్లో చెక్ ‌పెట్టండి!
Winter Immunity

Updated on: Dec 09, 2025 | 8:56 PM

శీతాకాలంలో, సూర్యరశ్మి లేకపోవడం, చలి, పొడి గాలి కారణంగా మన శరీరంలో రోగనిరోధక శక్తి లోపిస్తుంది. తద్వారా జలుబు, దగ్గు, వంటి వైరల్ జ్వరాలు అనారోగ్యాల ప్రమాదాన్ని పెంచుతాయి.ఈ వైరల్ జ్వరాలను నివారించడానికి ప్రజలు తరచుగా హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తారు.కానీ కొన్ని ఆయుర్వేద మూలికలతో మన ఇంట్లోనే ఈ సమస్యల నుంచి ఉపసమనం పొందే ఔషదాలను తరయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం మనకు తులసి మాత్రమే అవసరం అవుతుంది.

ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేయబడిన ఆరోగ్య నిపుణుల పోస్ట్ ప్రకారం.. ఒక లీటరు నీటిని తీసుకొని, అందులో 20-25 చూర్ణం చేసిన తులసి ఆకులు, 3 నుండి 5 లవంగాలు వేయమని ఆయన చెబుతున్నారు. ఆ నీరు బాగా మరిగిన తర్వాత, దానిని వడకట్టి ఒక గ్లాస్‌లోకి తీసుకొని ప్రతి అరగంటకు ఒకసారి తాగడం వల్ల శరీంలో రోగనిరోధక శక్తి పెరిగి.. సీజనల్ వ్యాధుల భారీ నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయన చెబుతున్నారు. తులసితో తయారుచేసిన ఈ కషాయం వైరల్ జ్వరాన్ని తగ్గించడమే కాకుండా గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

ఈ కషాయం ఎందుకు అంత ప్రత్యేకమైనది?

తులసి, లవంగాల లక్షణాలు వైరల్ జ్వరాలను తగ్గించడంలో సహాయపడతాయి. తులసి యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.అయితే లవంగాలు జలుబు, జ్వరాలను తగ్గించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి.

తులసి,లవంగాల ఇతర ప్రయోజనాలు

తులసి, లవంగాల కషాయం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, అలాగే గ్యాస్,ఆమ్లత్వం, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.అలాగే ఒత్తిడిని తగ్గించడంలో, మంచి మానసిక స్థితిని నిర్వహించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో, శ్వాసకోశ వ్యాధులను నివారించడంలో, శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో కూడా సహాయపడుతుంది.

(గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.