
ప్రతి ఒక్కరూ మారుతున్న రుతువులలో తినే ఆహారంలో మార్పులు చేసుకోవడంతో పాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే కొన్ని ఆహారాలను తప్పని సరిగా చేర్చుకోవాలి.అప్పుడు శరీరానికి వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మరింత సామర్ధ్యం లభిస్తుంది. శీతాకాలం ప్రారంభం కానుంది. ఉసిరి కూడా మార్కెట్లో లభిస్తుంది. అయితే చాలా మంది ఉసిరికి ఉన్న చల్లని స్వభావం కారణంగా దీనిని తినకూడదని భావిస్తారు. అయితే ఇది కాలానుగుణ పండు కనుక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. శీతాకాలంలో కూడా తినవచ్చు. నల్ల మిరియాలు వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. శీతాకాలంలో తరచుగా మిరియాలతో టీ, పాలు వంటి వాటిని తీసుకుంటారు.అయితే ఉసిరి, మిరియాలు రెండిటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కనుక వాటిని కలిపి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
భారతీయ సుగంధ ద్రవ్యాలను ఆరోగ్యానికి ఒక వరంలా భావిస్తారు. అందుకే వీటిని ఆహారంలో మాత్రమే కాదు ఆయుర్వేద మందులలో కూడా ఉపయోగిస్తారు. లవంగాలు, పసుపు , నల్ల మిరియాలు ఇలా వంట ఇంట్లో ఉండే సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి ఇంట్లో అనేక రకాల ఆహార పదార్ధాలను తయారు చేస్తారు. ఈ ఆహరం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఉసిరి, నల్ల మిరియాలను కలిపి తీసుకుంటే ఎన్నో రకాల సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
ఉసిరి, మిరియాల్లోని పోషకాలు
వెబ్ MD ప్రకారం నల్ల మిరియాలలో విటమిన్లు K, A, E, B1, B2, B5, B6, మాంగనీస్, రాగి, ఐరెన్, కాల్షియం, భాస్వరం, పొటాషియం, సెలీనియం, జింక్ , క్రోమియం వంటి క్రియాశీల సమ్మేళనాలు ఉన్నాయి. ఇంకా ఉసిరిలో విటమిన్లు C, ఇనుము, కాల్షియం, విటమిన్లు A ,E, ఫైబర్ , వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.
శక్తివంతమైన కలయిక
ఉసిరి, మిరియాలు కలయిక శక్తివంతమైన ఔషదం అని నిపుణులు చెబుతున్నారు.ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అయితే నల్ల మిరియాలలో పైపెరిన్ ఉంటుంది. ఇది పోషకాల శోషణను కనీసం 2000 శాతం పెంచుతుంది.
తెల్ల రక్త కణాలు పెరుగుతాయి
ఈ రెండు పదార్థాలను కలిపి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.వీటి ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే.. ఉసిరి తెల్ల రక్త కణాలను పెంచుతుంది. అయితే నల్ల మిరియాలు తినడం వల్ల ఉసిరిలోని విటమిన్ సి శరీరం సరిగ్గా గ్రహించేలా చేస్తుంది.
ఆరోగ్యంగా చర్మం, జుట్టు
ఉసిరి ఆరోగ్యానికి, చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది. దీనిని మిరియాలతో కలిపి తింటే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఈ రెండు పదార్థాలను కలిపి తినడం వల్ల మెరిసే చర్మం మీ సొంతం. ఎందుకంటే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మ స్థితిస్థాపకతను కాపాడడానికి అవసరం. అదే సమయంలో జుట్టును మెరిసేలా, బలంగా చేస్తుంది.
పేగు, కాలేయ ఆరోగ్యం
ఉసిరి, మిరియాల కలయిక జీర్ణవ్యవస్థ , కాలేయం రెండింటికీ మద్దతు ఇస్తుంది. ఎందుకంటే ఇది విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎవరైనా జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే దానిని తగ్గించడానికి సహాయపడుతుంది.
జలుబుకు దివ్యౌషధం
శీతాకాలంలో ఉసిరి, మిరియాలు కలిపి వాడటం సర్వరోగ నివారిణి అని నిపుణులు అంటున్నారు. ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వాతావరణం మారినప్పుడు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా ముఖ్యం. ఉసిరి శరీరాన్ని సమతుల్యం చేస్తుంది ఎందుకంటే ఇది చల్లబరుస్తుంది. చైతన్యం నింపుతుంది. నల్ల మిరియాలు అంతర్గతంగా వెచ్చదానాన్ని ఇస్తాయి. శ్లేష్మం పేరుకుపోవడాన్ని నివారిస్తాయి. ఈ కలయిక శీతాకాలపు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఎందుకంటే ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శ్వాసకోశ వ్యవస్థను క్లియర్ చేస్తుంది. తద్వారా కాలానుగుణ ఫ్లూ నుంచి రక్షిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)