Body pain Reliever: పెయిన్‌ కిల్లర్స్‌ వద్దు.. బాధించే ఒళ్లు నొప్పులకు ఈ ఆకు మంత్రంలా పనిచేస్తుంది..!

|

Feb 03, 2024 | 4:03 PM

ఇది దీర్ఘకాలిక నొప్పి లేదా స్వల్పకాలిక జ్వరాన్ని కూడా నయం చేస్తుంది. కొత్తిమీర అనేక వ్యాధులలో నొప్పి నివారిణిగా ఉపయోగపడుతుంది. కొత్తిమీరతో మంట, గాయం, మూత్ర విసర్జన, ఆకలి లేకపోవడం, జీర్ణక్రియ, జ్వరం, రక్తహీనత వంటి అనేక ఆయుర్వేద ఉపయోగాలు ఉన్నాయి. రోగి వయస్సు, వ్యాధిని బట్టి దీనిని వాడాలి. సరైన మోతాదును నిర్ణయించాలి. కాబట్టి ఈ ఔషధం ప్రయోజనం పొందడానికి, ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీనిని ఉపయోగించాలి.

Body pain Reliever: పెయిన్‌ కిల్లర్స్‌ వద్దు.. బాధించే ఒళ్లు నొప్పులకు ఈ ఆకు మంత్రంలా పనిచేస్తుంది..!
పచ్చి కొత్తిమీర తినటం వల్ల జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు పచ్చి కొత్తిమీరను తింటూ ఉంటే ఆ సమస్య త్వరగా తీరిపోతుంది. పచ్చి కొత్తిమీరను మజ్జిగలో కలిపి తాగడం వల్ల పొట్ట సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. మధుమేహం బాధితులకు పచ్చి కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది. రోజూ కాస్త పచ్చికొత్తిమీర తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో రక్తంలో ఇన్సులిన్ పరిమాణం నియంత్రణలో ఉంటుంది.
Follow us on

ప్రకృతిలో మన చుట్టూ చాలా మొక్కలు ఉన్నాయి. అవి ఒక్కోటి ఒక్కో వ్యాధి నివారిణిగా పనిచేస్తాయి. అటువంటి మూలికలలో ఒకటి కొత్తిమీర కూడా ఒకటి. ఇది సాధారణంగా దాని ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. కొత్తిమీర అనేక తీవ్రమైన వ్యాధులకు విరుగుడుగా పనిచేస్తుంది. అంతేకాదు.. తీవ్రమైన ఒళ్లు నొప్పులకు కూడా గొప్ప ఉపశమనంగా పనిచేస్తుంది. ఒళ్లు నొప్పులు బాధిస్తున్నప్పుడు సాధారణంగా చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ తాత్కాలిక ఉపశమనం పొందుతారు. కానీ, ఇలా ఒళ్ళు నొప్పులు బాధించిన ప్రతీసారి ఎక్కువ మోతాదులో పెయిన్‌ కిల్లర్స్‌ తీసుకోవడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెబుతున్నారు.. అవి ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకే ఒళ్లు నొప్పుల నుండి శాశ్వత ఉపశమనం కోసం ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ లేని ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎలాంటి నొప్పులకైనా హోం రెమెడీస్ చాలా అద్భుతంగా పని చేస్తాయి. అందులో కొత్తిమీర కూడా ఒకటి. కొత్తిమీర వాడకంతో కూడా ఒళ్లు నొప్పులను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

కొత్తిమీరతో ఆయుర్వేదంలో వివిధ ఉపయోగాలున్నాయి. దీని ఆకులను పేస్టులా చేసి వాపు లేదా గాయంపై రాస్తే గాయం త్వరగా మానుతుంది. దీని ఆకులు, వేర్ల కషాయం అన్ని కాలేయ వ్యాధులను నయం చేస్తుంది. దీని మూలం కడుపులో రాళ్లను నయం చేయడానికి ఉపయోగిస్తారు. కొత్తిమీర ఎండిన ఆకుల పొడిని ఉసిరి పొడితో కలిపి తీసుకున్నట్టయితే.. శరీరం నుండి రక్తహీనతను తొలగిస్తుంది. ఇది దీర్ఘకాలిక నొప్పి లేదా స్వల్పకాలిక జ్వరాన్ని కూడా నయం చేస్తుంది. కొత్తిమీర అనేక వ్యాధులలో నొప్పి నివారిణిగా ఉపయోగపడుతుంది. కొత్తిమీరతో మంట, గాయం, మూత్ర విసర్జన, ఆకలి లేకపోవడం, జీర్ణక్రియ, జ్వరం, రక్తహీనత వంటి అనేక ఆయుర్వేద ఉపయోగాలు ఉన్నాయి.

కానీ ఆయుర్వేద వైద్యులను సంప్రదించిన తర్వాతే, ఈ మందును వాడాలని పదే పదే చెబుతున్నారు. రోగి వయస్సు, వ్యాధిని బట్టి దీనిని వాడాలి. సరైన మోతాదును నిర్ణయించాలి. కాబట్టి ఈ ఔషధం ప్రయోజనం పొందడానికి, ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీనిని ఉపయోగించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..