Black Pepper Benefits: జ్ఞాపకశక్తి పెరుగుదలకు అద్భుతమైన దివ్వౌషధం.. రోజుకు రెండు నోట్లో వేసుకుంటే చాలు

|

Sep 19, 2023 | 1:38 PM

మిరియాలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఒకటి. ఇవి ఆహారం రుచిని పెంచడంతోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మిరియాలను హిందూ నామ పూజలో కూడా ఉపయోగిస్తారు. మిరియాలు ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్లనే వీటిని అనేక వ్యాధుల చికిత్సకు పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తుంటారు. మిరియాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ..

Black Pepper Benefits: జ్ఞాపకశక్తి పెరుగుదలకు అద్భుతమైన దివ్వౌషధం.. రోజుకు రెండు నోట్లో వేసుకుంటే చాలు
Black Pepper
Follow us on

మిరియాలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఒకటి. ఇవి ఆహారం రుచిని పెంచడంతోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మిరియాలను హిందూ నామ పూజలో కూడా ఉపయోగిస్తారు. మిరియాలు ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్లనే వీటిని అనేక వ్యాధుల చికిత్సకు పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తుంటారు. మిరియాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

యాంటీ ఆక్సిడెంట్ల స్టోర్‌హౌస్

బ్లాక్‌ పెప్పర్‌లో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల స్టోర్‌హౌస్‌గా పరిగణిస్తుంటారు. ఈ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వంటి హానికరమైన ప్రభావాలను శరీరంలోకి చేరకుండా నిరోధిస్తాయి. కాలుష్యం, సిగరెట్ పొగ, సూర్యకాంతి వంటి వాటికి గురికావడం వల్ల శరీరం ఫ్రీ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ కలిగిస్తుంది. అలాగే గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మిరియాలలో ఉండే పైపెరిన్ ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడి, ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గిస్తుంది

మిరియాలు శరీరంలో తాపాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే శరీరంలోని వివిధ భాగాల్లో వాపు వల్ల కీళ్లనొప్పులు, గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు వస్తాయి. బ్లాక్‌ పెప్పర్‌లో ఉండే కాంపౌండ్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది అలర్జీ, ఆస్తమా, ఆర్థరైటిస్ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

మెదడుకి మేలు

బ్లాక్‌ పెప్పర్ (నల్ల మిరియాలు) మెదడుకు చాలా మేలు చేస్తాయి. మిరియాల్లో ఉండే పైపెరిన్ మెదడు పనితీరును నియంత్రిస్తుందని ఎన్‌మైల్ చేసిన అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి సమస్యలు ఉన్నవారు నల్ల మిరియాలు తింటే ఉపశమనం లభిస్తుంది. మిరియాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాబట్టి జ్ఞాపకశక్తికి పదును పెట్టాలనుకునే వారు నల్ల మిరియాలు తినవచ్చు. ఇది జ్ఞాపకశక్తిని ఎక్కువ కాలం షార్ప్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

రక్తంలో చక్కెర నియంత్రణ

నల్ల మిరియాల్లో ఉండే పైపెరిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించగలదని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల డయాబెటిక్ రోగులకు బెల్ పెప్పర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

నల్ల మిరియాలు తినడం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నిజానికి నల్ల మిరియాలు క్రియాశీల సమ్మేళనాలు ఉంటాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తుంది. మిరియాలలో కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి. కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు పచ్చి మిరియాలు తినాలి. అయితే అందుకు ముందుగా మీ డాక్టర్‌ సలహా తీసుకోవడం మర్చిపోకండి.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.