ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకుంటారని అనే విషయంలో అందరికీ తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఆ వేడుకలను ప్రతిచోటా అంగరంగ వైభవంగా చేస్తారు. పైగా ఉత్తమ సేవలందించిన మహిళలను ఆ రోజు కచ్చితంగా సత్కరిస్తారు. ముఖ్యంగా ఆఫీసుల్లో పని చేసే మహిళా సిబ్బందిని సేవలను గుర్తుగా సన్మానిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది ఏదో ఓ థీమ్‌తో మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది డిజిట్‌ఆల్ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. అంటే లింగ సమానత్వం కోసం ఆవిష్కరణ, సాంకేతికత అంశంపై మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఉత్తమ సేవలను అందించిన మహిళలను సత్కరించే సమయంలో వారికి గుర్తుగా ఏదైనా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా జీవితాంతం గుర్తు ఉండేలా కొన్ని గిఫ్ట్ ఐడియాల గురించి ఓ సారి తెలుసుకుందాం.
ఉత్తమ మహిళలను సత్కరించాలనుకుంటే వారికి ఇచ్చే బహుమతి కూడా వారిని ఆకట్టుకునేలా ఉండాలి. కాబట్టి వారికి మహిళా దినోత్సవం రోజున గుర్తుండిపోయేలా పెర్సనలైజ్డ్ జ్యూయలరీ ప్రజెంట్ చేస్తే వారు కచ్చితంగా ఆనందపడతారు. ముఖ్యంగా వారి పేరులోని మొదటి అక్షరం వచ్చేలా ఉంగరం లేదా చైన్ విత్ లాకెట్ లాంటి ప్రజెంట్ చేయవచ్చు.
మహిళలను సత్కరించే సమయంలో వారిలోని ఆలోచనలను మెరుగ్గా చేయడానికి వారికి ఓ మంచి పుస్తకాన్ని ప్రజెంట్ చేయవచ్చు. విలువలకు అనుగుణంగా ఉండే పుస్తకాన్ని ఎంపిక చేయడం మాత్రం మర్చిపోకూడదు.
మొక్కలు ఒక స్థలాన్ని ప్రకాశవంతం చేయడానికి, ఇంటి లోపల సహజ సౌందర్యాన్ని తీసుకురావడానికి గొప్ప మార్గం. అదనంగా, అవి చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. కాబట్టి సత్కరించిన మహిళలకు మొక్కలను ప్రజెంట్ చేస్తే మంచింది.
మీరు అభిమానం తెలపాలనుకునే మహిళ వంట చేయడం ఇష్టపడే వాళ్లు అయితే వారి వంటల్లో కొత్త నైపుణ్యం లేదా టెక్నిక్ నేర్చుకునేందుకు సాయం చేయాలి. ముఖ్యంగా వారిని ఏదైనా వంట క్లాస్‌లో వారిని జాయిన్ చేస్తే మంచిది.
ప్రస్తుతం సినిమాలు, సీరియళ్లు వంటివి చూడాలంటే కచ్చితంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఆధారపడుతున్నారు. కాబట్టి మనం గౌరవించాలనుకునే మహిళలకు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఆఫర్ చేయవచ్చు.
మీరు గౌరవించాలనుకునే మహిళల మంచి ఫొటోలను సెలెక్ట్ చేసి ఓ ఆల్బమ్ చేసి వారికి అందిస్తే చాలా సంతోషిస్తారు. వారి అనుభూతులను నిక్షిప్తం చేసిన ఫొటో ఆల్బమ్‌ను జీవితాంతం జాగ్రత్త చేసుకుంటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..