AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెల్ల జుట్టు మళ్లీ నలుపుగా మారాలంటే ఇలా చేయండి.. మంచి రిజల్ట్ ఉంటుంది..!

ఆయుర్వేదంలో తెల్ల జుట్టును నలుపుగా మార్చడమే కాదు.. జుట్టును బలంగా, దట్టంగా, మెరిసేలా ఉంచే పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పెద్ద వయసు వారికి జుట్టు తెల్లబడుతుంది. కానీ ఈ రోజుల్లో చిన్న పిల్లల జుట్టు కూడా తెల్లబడుతోంది. దీనికి ముఖ్య కారణాలు శరీరానికి సరైన పోషకాలు అందకపోవడం, కాలుష్యం, ఎక్కువ కెమికల్స్ వాడటం.

తెల్ల జుట్టు మళ్లీ నలుపుగా మారాలంటే ఇలా చేయండి.. మంచి రిజల్ట్ ఉంటుంది..!
Black Hair
Prashanthi V
|

Updated on: Jun 16, 2025 | 4:39 PM

Share

జుట్టు తెల్లబడటం ఎవరికీ నచ్చదు. అందుకే చాలా మంది మార్కెట్‌ లో దొరికే డైలు, హెన్నా కలర్‌ లు వాడుతారు. అయితే ఇవి తాత్కాలికమే. ఎక్కువ కాలం వాడితే జుట్టు బలహీనపడుతుంది. కానీ సహజంగా జుట్టును నలుపుగా మార్చుకోవచ్చు. దీని కోసం ఆయుర్వేద పద్ధతులు చాలా ఉపయోగపడుతాయి.

నేల ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టులో కనిపించే వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తాయి. అలాగే కరిసాలంకన్ని జుట్టుకు సహజ నలుపు రంగును తిరిగి తెస్తుంది. ఈ ఆయిల్ తయారీ పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • నేల ఉసిరి పొడి – 2 చెంచాలు
  • కరిసాలంకన్ని పొడి – 2 చెంచాలు
  • కొబ్బరి నూనె – 2 చెంచాలు

ఇప్పుడు ఒక ఐరన్ పాన్ తీసుకొని కొబ్బరి నూనె వేసి వేడి చేయండి. అందులో పైన చెప్పిన రెండు పొడులను వేసి 5-7 నిమిషాలు మరిగించండి. పూర్తిగా మరిగిన తర్వాత చల్లారనివ్వండి. తర్వాత ఈ నూనెను గాజు సీసాలో నిల్వ చేయండి. అవసరమైనప్పుడు కొంచెం వేడి చేసి జుట్టుకు పట్టించి మర్దన చేయండి. రాత్రి పూట పట్టించి ఉదయం తలస్నానం చేయండి. ఈ ఆయిల్‌ ను వారానికి రెండు సార్లు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.

కరివేపాకులో ఉండే ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు జుట్టు రూట్లను బలపరుస్తాయి, తెల్ల జుట్టును తగ్గిస్తాయి. ఈ ఆయిల్ ని ఎలా తయారీ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  • కరివేపాకు – 10-15 ఆకులు
  • కొబ్బరి నూనె – 4 చెంచాలు

కొబ్బరి నూనెను ఐరన్ పాన్ లో వేడి చేసి అందులో కరివేపాకు వేసి మరిగించండి. ఆకులు నల్లగా మారే వరకు ఉంచండి. చల్లారిన తర్వాత గాజు సీసాలో నిల్వ చేయండి. ఈ నూనెను స్నానానికి 2 గంటల ముందు తలకు పట్టించి మర్దన చేయండి. వారానికి 2 సార్లు వాడితే జుట్టు నలుపుగా మారడంలో సహాయపడుతుంది.

హెన్నా జుట్టును బలంగా ఉంచుతుంది. ఇండిగో సహజంగా నలుపు రంగును ఇస్తుంది. ఈ రెండు కలిపి వాడితే జుట్టు నలుపుగా మారడంలో సహాయపడుతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  • హెన్నా పొడి – 4 చెంచాలు
  • ఇండిగో పొడి – 4 చెంచాలు
  • కాఫీ పొడి – 1 చెంచా
  • వేడి నీరు – సరిపడా

మొదట హెన్నా పొడిని వేడి నీటిలో కలిపి పేస్ట్ చేసి 5 గంటలు ఉంచండి. తర్వాత తలకి అప్లై చేసి 2 గంటలు ఉంచి శుభ్రంగా కడగండి. అలాగే ఇండిగోను కూడా తయారు చేసి వాడండి. ఈ పద్ధతిని పాటిస్తే తెల్ల జుట్టు సహజంగా నలుపుగా మారుతుంది.

ముందుగా హెన్నా పొడిని తగినంత వేడి నీటిలో కలిపి పేస్ట్‌ లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ ను 5 గంటల పాటు పక్కన ఉంచండి. 5 గంటల తర్వాత ఈ హెన్నా పేస్ట్‌ ను మీ జుట్టుకు, ముఖ్యంగా తెల్ల జుట్టుపై బాగా అప్లై చేయండి. దీన్ని 2 గంటల పాటు జుట్టుపై ఉంచి ఆ తర్వాత శుభ్రంగా కడిగేయండి.

ఇప్పుడు ఇండిగో పొడిని కూడా తగినంత వేడి నీటిలో కలిపి పేస్ట్‌ లా తయారు చేసుకోండి. ఇందులో ఒక చెంచా కాఫీ పొడిని కలపండి. ఇది ఇండిగో రంగును మరింత స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ పేస్ట్‌ ను వెంటనే (ఎక్కువ సమయం ఉంచకుండా) జుట్టుకు అప్లై చేయాలి.

ఇండిగో పేస్ట్‌ ను హెన్నా వేసిన తర్వాత శుభ్రం చేసిన జుట్టుకు పట్టించండి. దీన్ని కూడా 1 నుండి 2 గంటల పాటు ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో పూర్తిగా కడిగేయండి. షాంపూ వాడకుండా ఉండటం మంచిది. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే మీ తెల్ల జుట్టు సహజంగా నలుపు రంగులోకి మారుతుంది. ఇది జుట్టుకు రంగును ఇవ్వడమే కాకుండా.. జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

(NOTE: పై చిట్కాలు ఉపయోగించే ముందు తప్పని సరిగా పాచ్ టెస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ఎలాంటి అలర్జీ, దురద రాకపోతే మాత్రమే తలకు వాడాలి)

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?