Benefits of Cucumber: కీరా దోసకాయ మాత్రమే కాదు.. తొక్కలతో కోరినంత ఆరోగ్యం..! ప్రయోజనాలు తెలిస్తే తీసి పారేయరు..

|

Apr 30, 2024 | 5:53 PM

దోసకాయ వల్ల శరీరంలోని విషతుల్యాలు తొలగిపోవడంతో పాటు చెడు కొవ్వు తగ్గి బరువు కూడా అదుపులో ఉంటుంది. కీర దోసకాయ ప్రయోజనాలు మనందరికీ తెలుసు. అయితే, దోసకాయను తొక్కలతో తింటున్నారా..? లేదంటే, తొక్కను తొలగించి పడేస్తున్నారా..? కానీ, దోసకాయ తొక్కతో కూడా చాలా ప్రయోజనాలను ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

Benefits of Cucumber: కీరా దోసకాయ మాత్రమే కాదు.. తొక్కలతో కోరినంత ఆరోగ్యం..! ప్రయోజనాలు తెలిస్తే తీసి పారేయరు..
Cucumber Peels
Follow us on

వేసవిలో శీతలపానియాలు, కొబ్బరి బోండాలు, ఐస్‌ క్రీమలకు గిరాకీ బాగా ఉటుంది. అలాగే, దోసకాయను కూడా ఎక్కువగా తింటుంటారు. మండే ఎండల్లో శరీరానికి చలువనిచ్చేది కీరా దోసకాయ. ఎన్నో పోషకాలు నిండి ఉన్న ఈ దోసకాయ వల్ల శరీరంలోని విషతుల్యాలు తొలగిపోవడంతో పాటు చెడు కొవ్వు తగ్గి బరువు కూడా అదుపులో ఉంటుంది. కీర దోసకాయ ప్రయోజనాలు మనందరికీ తెలుసు. అయితే, దోసకాయను తొక్కలతో తింటున్నారా..? లేదంటే, తొక్కను తొలగించి పడేస్తున్నారా..? కానీ, దోసకాయ తొక్కతో కూడా చాలా ప్రయోజనాలను ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…

దోసకాయ తొక్కలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని తొక్కలను అనేక రకాలుగా తినొచ్చునంటున్నారు. మీరు దీన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే, మీరు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. కడుపు సంబంధిత సమస్యలను నయం చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇవి మీ శరీరాన్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో బాగా సహాయపడుతాయి. కీరదోసకాయను తొక్కతో తినటం వల్ల వయసు పెరిగే లక్షణాలను నెమ్మదిస్తుంది. ఎక్కువ కాలం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఈ మండే వేడిలో మిమ్మల్ని తాజాగా, చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. మీ శరీరం నుండి నీటి నష్టాన్ని తొలగించడం ద్వారా మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.

దోసకాయ శరీరంలో నీటి కొరతను పోగొట్టడం ద్వారా అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. కీర దోసకాయను చెత్తబుట్టలో పడేసే ముందు, దాని ప్రయోజనాలను తెలుసుకోండి. ఇది పోషక మూలకాలతో సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, అనేక ఇతర పోషకాలు తొక్కలో ఉంటాయి. మీరు అధిక బరువుతో ఉంటే, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఎముకలు బలపడాలంటే దోసకాయ తొక్క కూడా తినాలి. ఇది మీ శరీర కణాలను సరిగ్గా నిర్వహించడంలో మీకు చాలా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

కళ్లు అలసిపోవడం, కళ్ల కింద క్యారీ బ్యాగ్స్.. వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కీరాదోస ముక్కల్ని, లేదంటే తొక్కను కూడా కళ్లపై కాసేపు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చల్లని దోసకాయ తొక్కను మీ కళ్లపై అప్లై చేసుకోవటం వల్ల కళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని తేమగా ఉంచుతుంది. కీరదోసకాయ తొక్కను తీసుకుని 10 నుండి 15 నిమిషాల వరకు మీ కళ్ళపై పై ఉంచండి. కళ్ల కింద కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా చేస్తే కళ్లకు ప్రశాంతతను అందింస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..