రాత్రి పడుకునే ముందు ఈ పచ్చి ఆకులను పిడికెడు నమిలితే చాలు..! ఆరోగ్యంతో పాటు జుట్టు సమస్యలకు సంజీవని..!

|

Oct 14, 2023 | 7:33 AM

వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మీ జుట్టు సరిగ్గా పెరగడం లేదు, మీరు కూడా జుట్టు రాలిపోయే సమస్యతో ఇబ్బంది పడుతుంటే, ఈ ఆకులను ఉపయోగించవచ్చు. దీని వల్ల మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. జుట్టు ఆరోగ్యానికి ఇది దివ్యౌషధం. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు దీని పచ్చి ఆకులను తింటే జుట్టు ఒత్తుగా, పొడవుగా నల్లగా మారుతుంది.

రాత్రి పడుకునే ముందు ఈ పచ్చి ఆకులను పిడికెడు నమిలితే చాలు..! ఆరోగ్యంతో పాటు జుట్టు సమస్యలకు సంజీవని..!
Moringa Leaves
Follow us on

ప్రతి ఒక్కరూ తమ జుట్టు ఒత్తుగా, మృదువుగా, నల్లగా, పొడవుగా ఉండాలని కోరుకుంటారు. దీని కోసం ప్రజలు అనేక నివారణలు ప్రయత్నిస్తారు. మార్కెట్‌లో లభించే ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగించేవారు కూడా చాల మందే ఉంటారు. అలాంటి వారి కోసం ఇక్కడ మనం ఇంటి వైద్యాన్ని తెలుసుకుందాం.. దివ్య ఔషధాల సమూహంలో ఒకటైన మునగ ఆకు ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. దీనిని తీసుకోవడం మీ ఆరోగ్యానికే కాకుండా మీ జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. మునగ ఆకుల్లో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. మునగ ఆకులను మీ ఆహారంలో చేర్చుకోవటం వల్ల తీవ్రమైన వ్యాధులు దూరంగా ఉంటాయి. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మీ జుట్టు సరిగ్గా పెరగడం లేదు, మీరు కూడా జుట్టు రాలిపోయే సమస్యతో ఇబ్బంది పడుతుంటే, ఈ ఆకులను ఉపయోగించవచ్చు. దీని వల్ల మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. జుట్టు ఆరోగ్యానికి ఇది దివ్యౌషధం. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు దీని పచ్చి ఆకులను తింటే జుట్టు ఒత్తుగా, పొడవుగా నల్లగా మారుతుంది. వాటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మునగ కషాయాన్ని ఉదయాన్నే తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

జుట్టు రాలడానికి నివారణగా మునగ ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

జుట్టు రాలడంతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు ఈ ఆకులను తినాలి. మునగ ఆకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, బయోటిన్ కూడా ఉన్నాయి. ఈ ఆకులను తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యను నివారించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది..

మునగ ఆకులు జుట్టు, చర్మం రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటాయి. దీని ఆకుల పేస్ట్‌ని జుట్టు మీద అప్లై చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో జుట్టు త్వరగా పొడవుగా మందంగా మారుతుంది.

మీరు రాత్రి పడుకునే ముందు ఈ ఆకులను తినాలనుకుంటే, ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కొన్ని ఆకులను శుభ్రంగా కడిగి నమలి మింగేయండి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు పొడవుగా, నల్లగా మారుతాయి. జుట్టు సమస్య దూరమవుతుంది. అంతే కాకుండా, ఇది చర్మం మెరుపును కాపాడుతుంది.

* మునగ ఆకుల హెయిర్ ప్యాక్ ను ఇలా సిద్ధం చేసుకోండి..

– ముందుగా కొన్ని మునగ ఆకులను తీసుకోండి.

– నీటితో శుభ్రం చేసి పేస్ట్‌లా చేసుకోవాలి.

– దీని తర్వాత ఈ పేస్ట్‌ను కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు అప్లై చేయండి.

– ఇప్పుడు మీ జుట్టు తలపై సున్నితంగా మసాజ్‌ చేసుకోండి.

– కొన్ని నిమిషాల తర్వాత అది ఆరిపోయాక నీటితో శుభ్రం చేసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మంచిది.