Beauty Tips For Skin: మోకాళ్లు, మేచేతుల వద్ద చర్మం నల్లగా ఉందా?.. అయితే ఇలా తొలగించుకోండి..

|

Oct 09, 2021 | 1:20 PM

Beauty Tips For Skin: చాలా మంది మోచేతులు, మోకాళ్ల వద్ద డార్క్(నల్లని) స్కిన్ ఉంటుంది. అలా కావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అందుకే చాలా మంది ఫుల్ హ్యాండ్ షర్ట్స్..

Beauty Tips For Skin: మోకాళ్లు, మేచేతుల వద్ద చర్మం నల్లగా ఉందా?.. అయితే ఇలా తొలగించుకోండి..
Health
Follow us on

Beauty Tips For Skin: చాలా మంది మోచేతులు, మోకాళ్ల వద్ద డార్క్(నల్లని) స్కిన్ ఉంటుంది. అలా కావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అందుకే చాలా మంది ఫుల్ హ్యాండ్ షర్ట్స్, ప్యాంట్స్ వేసుకుంటుంటారు. చిన్న దుస్తులు ధరించడానికి భయపడుతుంటారు. ముఖ్యంగా మన భారతదేశంలో చాలా మందికి ఇలాగే ఉంటుంది. మోకాలు, మోచేతుల వద్ద చర్మ రంగు.. మిగిలిన శరీర రంగుకు సరిపోలదు. అందుకే ప్యాషన్ దుస్తులు ధరించడానికి వెనుకాడుతారు. అయితే, మోచేతులు, మోకాళ్ల వద్ద స్కిన్ టోన్ బ్లాక్‌గా ఉన్నట్లయితే.. కొంచెం శ్రద్ధ పెట్టడం ద్వారా దానిని తొలగించుకోవచ్చునని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

వాస్తవానికి మోకాలు, మోచేతుల చుట్టూ చర్మం నల్లబడటం సర్వసాధారణం. అన్ని రకాల స్కిన్ టోన్లు కలిగిన వ్యక్తులు ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. స్నానం చేసే సమయంలో స్క్రబ్ చేయకపోవడం వలన.. ఆ ప్రాంతాల్లో చర్మం రంగు అలా మారుతుందట. సరిగా వాష్ చేయకపోవడం వలన డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోయి స్కిన్ టోన్ బ్లాక్‌గా ఏర్పడుతుందట. అయితే, సరైన ఎక్స్‌ఫోలియేషన్, మాయిశ్చరైజేషన్‌ యూజ్ చేయడం ద్వారా ఈ సమస్యను ఎదుర్కోవచ్చునని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మరి మోకాళ్లు, మోచేతుల వద్ద ఉన్న డార్క్ సర్కిల్స్ ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

నిమ్మకాయ..
నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్‌లు, విటమిన్ సి కలిగి బ్లీచింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని పునరుత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇది గొప్ప ఎక్స్‌ఫోలియేటర్ కూడా. ఒక నిమ్మకాయ తీసుకుని.. దానిని సగానికి కట్ చేయాలి. మోచేతులు, మోకాళ్లపై ఎక్కడైతే డార్క్ స్కిన్ ఉంటుందో అక్కడ ఆ నిమ్మరసాన్ని స్క్రబ్ చేయాలి. సుమారు 15 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే ఆ డార్క్ స్కిన్ కాస్తా వైట్ టోన్‌గా మారిపోతోంది.

పసుపు..
ఇంట్లో మనకు అత్యంత చౌకగా లభించే పదార్థం పసుపు. దీని ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని చర్మకాంతి కోసం మహిళలు విరివిగా వినియోగిస్తుంటారు. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ పెరుగుతో 2 టేబుల్ స్పూన్ల శనగ పిండి, 1 టేబుల్ స్పూన్ పసుపును తీసుకుని మిక్స్ చేయాలి. బాగా పేస్ట్‌ మాదిరిగా చేసుకుని.. మోచేతులు, మోకాళ్లపై అప్లై చేయాలి. ఆ తరువాత 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. వారానికి రెండు, మూడు సార్లు ఇలా చేయడం ద్వారా డార్క్ సర్కిల్స్‌ని తొలగించుకోచ్చు.

కలబంద..
అలోవెరా ఒక సహజమైన మాయిశ్చరైజర్. చర్మ కాంతిని పెంచే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది దెబ్బతిన్న చర్మ కణాలను కూడా రిపేర్ చేస్తుంది. చర్మం పొడిబారకుండా చూస్తుంది. కలబంద యొక్క తాజా ఆకులను తీసుకొని దాని నుంచి జెల్ తీయాలి. అర కప్పు పెరుగుతో జెల్ కలపాలి. మోకాళ్లు, మోచేతులపై ఉన్న నల్లటి చర్మంపై అప్లై చేయాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా తరచుగా చేయడం వల్ల చాలా సులభంగా బ్లాక్ స్కిన్‌ టోన్‌ను తొలగిపోతాయి.

Also read:

Man Climbs Tree: అరెస్ట్ చేయడానికి వస్తే చుక్కలు చూపించాడు.. మ్యాటరేంటో తెలిస్తే పడి పడి నవ్వుతారు..

Andhra Pradesh: అనంతలో వాట్సప్ మెసేజ్ కలకలం.. క్షణాల్లో పోలీసుల రియాక్షన్.. సీన్ కట్ చేస్తే..

Government of India: దేశం ముందు మరో పెద్ద సంక్షోభం.. కీలక విషయాన్ని ప్రకటించిన కేంద్ర మంత్రి..!