Beauty Care Tips: అమ్మాయిలు రెగ్యులర్ లైఫ్‌లో చిన్న మార్పులు చేసుకోండి.. మేకప్ లేకుండా మెరిసిపోవచ్చు

మేకప్ వేసుకోవడం అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాకపోవచ్చు. పైగా ఖర్చుతో కూడుకున్న పనికూడా.. అంతేకాదు అదే పనిగా మేకప్ వేసుకున్నా చర్మం పాడవుతుంటుంది. కొన్ని రకాల స్కిన్  సమస్యలు వస్తుంటాయి. అయితే మేకప్ లేకుండా కూడా ముఖాన్ని అందంగా, కోమలంగా తీర్చిదిద్దుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే దీనికోసం కొన్ని టిప్స్ పాటించాలని సూచిస్తున్నారు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.. 

Beauty Care Tips: అమ్మాయిలు రెగ్యులర్ లైఫ్‌లో చిన్న మార్పులు చేసుకోండి.. మేకప్ లేకుండా మెరిసిపోవచ్చు
Natural Beauty Care Tips

Edited By:

Updated on: Jun 15, 2024 | 9:08 PM

ఫంక్షన్ చిన్నదా, పెద్దదా అనే తేడా లేదు..  ఏ అకేషన్ అయినా సరే మహిళలు స్పెషల్ గా కనిపించాలని కోరుకుంటారు. ఇందు కోసం కొన్ని రోజుల ముందు నుంచి రకరకాల బ్యూటీ టిప్స్ ఫాలో అవుతుంటారు. అసలైన ఫంక్షన్ రోజున లేచింది మొదలు మేకప్ చేసుకుంటూనే ఉంటారు. ఇది సెలబ్రిటీల నుంచి, సామాన్యుల వరకు అందరూ మహిళలు చేసే పనే. అయితే మేకప్ వేసుకోవడం అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాకపోవచ్చు. పైగా ఖర్చుతో కూడుకున్న పనికూడా.. అంతేకాదు అదే పనిగా మేకప్ వేసుకున్నా చర్మం పాడవుతుంటుంది. కొన్ని రకాల స్కిన్  సమస్యలు వస్తుంటాయి. అయితే మేకప్ లేకుండా కూడా ముఖాన్ని అందంగా, కోమలంగా తీర్చిదిద్దుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే దీనికోసం కొన్ని టిప్స్ పాటించాలని సూచిస్తున్నారు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

  1. రోజువారి జీవనశైలిలో చిన్నపాటి మార్పులతో సహజసిద్ధమైన మెరుపు పొందవచ్చు. దీని కోసం ప్రతిరోజు 8 గ్లాసుల నీళ్లు తాగడం తప్పనిసరి. దీనివల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకి వెళ్లిపోతాయి. దాంతో చర్మం సహజంగా కాంతిని సంతరించుకుంటుంది.
  2. వారానికి రెండు సార్లు అయిన ఐస్ క్యూబ్స్ తో ముఖంపై మర్దన చేసుకుంటూ ఉండాలి. ఐదు నిమిషాల పాటు ఇలా చేస్తే చర్మం తేలికగా మారుతుంది. ముడతలు తగ్గి చర్మం బిగుతుగా తయారవుతుంది. దద్దుర్లు ఉంటే తగ్గిపోతాయి.
  3. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. రోజు నిద్ర పోయే ముందు అలోవెరా జెల్ తో గాని, కొబ్బరి నూనెతో కానీ కళ్ల కింద మర్దన చేయాలి.
  4. నిద్రపోయే ముందు ముఖాన్ని మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలి.. అప్పుడు ముఖంపై చేరిన దుమ్ము కణాలు తొలగిపోతాయి. దీని ద్వారా చర్మం మృదువుగా కనిపిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఈ టిప్స్ ఫాలో అయిపోతే మేకప్ లేకుండానే మీరు అందంగా సహజ సౌందర్యంతో కనిపిస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..