Skincare Mistakes: మచ్చలేని అందం మీ సొంతం కావాలంటే.. మర్చిపోయి కూడా ఈ పొరబాట్లు చేయకండి..

|

Sep 12, 2023 | 12:45 PM

పురుషుల కంటే మహిళలు అందంపై ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారనేది కాదనలేని వాస్తవం. హైడ్రేషన్ నుంచి మేకప్ రిమూవల్ వరకు ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధ కనబరుస్తుంటారు. అందుకు ఎన్నో రకాలుగా బ్యూటీ టిప్స్‌ ఫాలో అవుతుంటారు. కానీ కొంతమంది తెలిసో తెలియకో కొన్నిరకాల పొరపాట్లు చేస్తుంటారు. దాని కారణంగా..

Skincare Mistakes: మచ్చలేని అందం మీ సొంతం కావాలంటే.. మర్చిపోయి కూడా ఈ పొరబాట్లు చేయకండి..
Spotless Skin
Follow us on

పురుషుల కంటే మహిళలు అందంపై ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారనేది కాదనలేని వాస్తవం. హైడ్రేషన్ నుంచి మేకప్ రిమూవల్ వరకు ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధ కనబరుస్తుంటారు. అందుకు ఎన్నో రకాలుగా బ్యూటీ టిప్స్‌ ఫాలో అవుతుంటారు. కానీ కొంతమంది తెలిసో తెలియకో కొన్నిరకాల పొరపాట్లు చేస్తుంటారు. దాని కారణంగా వారి చర్మ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవుతుంది. ఈ తప్పులను సరిదిద్దుకుంటే మగువల చర్మం ఎప్పుడూ మెరుస్తూ కాంతులీనుతుంది. చర్మ సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సౌందర్య నిపుణుల మాటల్లోనే మీకోసం..

టవల్‌తో ముఖాన్ని ఇలా తుడుచుకోకూడదు

స్త్రీలు, పురుషులు ఎవరైనా సాధారణంగా ముఖాన్ని నీళ్లతో కడిగిన తర్వాత తడిని తుడుచుకోవడానికి తువ్వాలను ఉపయోగిస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ముఖంపై బ్యాక్టీరియా ఏర్పడుతుందని చాలా మందికి తెలియదు. ఎందుకంటే టవల్ ప్రతిరోజూ శుభ్రం చేయకపోవడమే అందుకు కారణం. కాబట్టి నీళ్లతో కడిగిన తర్వాత ముఖాన్ని తుడుచుకోవడానికి ఎల్లప్పుడూ శుభ్రంగా ఉన్న టవల్ మాత్రమే వినియోగించాలంటున్నారు నిపుణులు.

చర్మ సంరక్షణకు కాస్మటిక్స్ అలా వినియోగించకూడదు

చర్మ సంరక్షణ ఉత్పత్తులను రొటీన్‌గా ఉపయోగించడం అంతమంచిది కాదు. దేనిని ఎలా వినియోగిచాలో తదనుగుణంగా వాటిని ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. చాలా మంది ముందుగా మాయిశ్చరైజర్‌ పూతలా పూసి, ఆపై సీరమ్‌ను అప్లై చేస్తారు. ఇది తప్పు ప్రక్రియ. ఎల్లప్పుడూ ముందుగా సన్నని పొర ఉత్పత్తులను వినియోగించి ఆ తర్వాత మందపాటి పొర ఉత్పత్తులను వినియోగించాలి. సీరం పొర పలుచగా ఉంటుంది. కాబట్టి సీరం తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

ఇవి కూడా చదవండి

మేకప్‌ రిమూవర్‌

ముఖంపై వేసుకున్న మేకప్ తొలగించడానికి చాలా మంది చేతి వేళ్లను వినియోగిస్తుంటారు. నిజానికి ఇది తప్పు ప్రక్రియ. నిజానికి ఇలా చేయడం వల్ల మీ ముఖంపై క్రీమ్‌లోకి సులువుగా బ్యాక్టీరియా చేరిపోతుందంటున్నారు నిపుణులు. చేతులకు బదులుగా పూర్తిగా కడగడం లేదా స్కూప్/గరిటెని ఉపయోగించాలి.

అతిగా పానీయాలు తాగకూడదు

చాలా మంది చీటికి మాటికి నీళ్లు తాగేస్తుంటారు. దాహంగా అనిపించినా లేకున్నా సోడా ఆధారిత పానీయాలను సేవించకూడదు. ఇలా చేయడం వల్ల చర్మం దెబ్బతింటుంది. నిజానికి దాహం వేస్తే కొబ్బరి నీళ్లు, మంచి నీల్లు, జ్యూస్ మొదలైన సహజ పానీయాలు తాగడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.

రాత్రి నిద్రకు ముందు మేకప్‌ తొలగించాలి

కొందరు రాత్రిపూట నిద్రకు ముందు మేకప్ తొలగించడం లేదా ముఖం శుభ్రం చేసుకోవడం మర్చిపోతుంటారు. ఇలా చేయడం ద్వారా మేకప్ రాత్రంతా చర్మంపై ఉంటుంది. ఫలితంగా చర్మానికి హాని తలెత్తుతుంది. అంతేకాకుండా రాత్రిపూట సహజంగా చర్మ సంరక్షణకు జరిగే ప్రక్రియ కూడా ఆగిపోతుంది. అందుకే రాత్రి పడుకునే ముందు ఎప్పుడూ మేకప్ తీసేసి ముఖం శుభ్రం చేసుకుని నిద్రకు ఉపక్రమించాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్‌ చేయండి.