
వేసవికాలంలో ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వేసవికాలంలో మీ శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎండ వేడిమి వల్ల మన శరీరం చెమట రూపంలో శక్తిని కోల్పోతూ ఉంటుంది. వీటిని భర్తీ చేసుకునేందుకు మన ఆహారంలో అనేక మార్పులను చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని దృష్టిలో ఉంచుకొని వేసవికాలంలో చేయాల్సిన ఆహార మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వేసవిలో మీ ఆహారంలో నీటి శాతం ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఎందుకంటే వేసవిగా మీ శరీరం నుంచి ఎక్కువగా నీళ్లు వృధా అవుతుంది. కావున మీరు తీసుకునే ఆహారంలో నీరు ఉండేలా చూసుకోవాలి.
పెరుగు:
వేసవిలో పెరుగు చాలా మంచిది. పెరుగన్నం కలుపుకొని తింటే మన కడుపులో పేగులకు కావాల్సిన గట్ బ్యాక్టీరియా లభిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థను చక్కగా క్రమబద్ధీకరిస్తుంది. అంతేకాదు మన శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తుంది. ముఖ్య పెరుగు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి అలాగే కాల్షియం విటమిన్ సి, ఏ, బి12 కూడా పుష్కలంగా లభిస్తాయి అలాగే వేసవికాలంలో పెరుగు వడదెబ్బ తగలకుండా కూడా కాపాడుతుంది అందుకే పెరుగన్నం తింటే వేసవిలో ఆరోగ్యానికి చాలా మంచిది.
సోయాబీన్స్:
వేసవిలో సోయాబీన్స్ ను ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది ఇందులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి కావున మీ శరీరానికి కావలసిన పోషకాలు అన్ని కూడా ఇస్తాయి. సోయాబీన్స్ ను నానబెట్టి ఆ తర్వాత ఉడకబెట్టుకొని కూరల్లో చిరు కలుపుకొని తినడం ద్వారా చక్కటి పోషకాలు మీకు లభించే అవకాశం ఉంది పాలను సైతం తీసుకోవడం ద్వారా మీకు మంచి పోషకాలు లభిస్తాయి మార్కెట్లో సోయా మిల్క్ రూపంలో సోయా పాలు లభిస్తాయి. అదేవిధంగా సోయా చాంక్స్ వీటినే మిల్ మేకర్ అని కూడా అంటారు. వీటిని కూడా తీసుకోవడం ద్వారా మీకు మంచి పోషకాలు లభిస్తాయి.
పప్పు దినుసులు:
వేసవి ల కాలంలో పప్పు దినుసులను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మన శరీరం చెమట రూపంలో శరీరానికి కావలసిన లవణాలను మినరల్స్ ను ఎక్కువగా కోల్పోతుంది అందుకే మీకు శక్తి కోసం ప్రోటీన్స్ అవసరం అవుతాయి పప్పు దినుసుల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కావున వేసవిలో పప్పు దినుసులతో చేసిన వంటకాలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే వేసవికాలంలో మాంసాహారం తీసుకోవడం ద్వారా శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది కావున మాంసాహారానికి బదులు శాఖాహార ప్రోటీన్స్ అయినటువంటి పప్పు దినుసులను తీసుకుంటే చాలా మంచిది.
కీర దోసకాయ:
వేసవిలో కీరా దోసకాయలతో చేసిన సలాడ్స్ తీసుకోవడం ద్వారా శరీరంకి మంచి పోషకాలు లభిస్తాయి ముఖ్యంగా కీరా దోశలో ఉండే నీరు మీ శరీరానికి కావాల్సిన లవణాలను సరఫరా చేస్తుంది. అలాగే కీరా దోశలో అనేక ఖనిజలవణాలు కూడా ఉంటాయి ఇవి మన శరీరం చమట ద్వారా కోల్పోయిన నీటిని భర్తీ చేస్తాయి కావున కీరా దోషను వేసవిలో ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది శరీరానికి చలవ చేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..