AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాక్స్‌లో బిర్యానీ ఆకు పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..? నిజమేంటో తెలిస్తే..

మనం వంటగదిలో రుచి, సువాసన కోసం ఉపయోగించే బిర్యానీ ఆకు కేవలం వంటకాలకే పరిమితం కాలేదు. ఇటీవల సోషల్ మీడియాలో రాత్రి పడుకునే ముందు సాక్స్‌లో బిర్యానీ ఆకు పెట్టుకుంటే కలిగే ప్రయోజనాలు అనే అంశం విశేషంగా ప్రచారంలోకి వచ్చింది. అసలు ఈ చిట్కా వెనుక ఉన్న కథేంటి? వైద్య నిపుణులు, ఆయుర్వేద నిపుణులు దీనిపై ఏమంటున్నారు? అనే వివరాలు చూద్దాం.

సాక్స్‌లో బిర్యానీ ఆకు పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..? నిజమేంటో తెలిస్తే..
Sleeping With Bay Leaf In Socks
Jyothi Gadda
|

Updated on: Oct 07, 2026 | 7:25 PM

Share

రాత్రి పడుకునే ముందు కాళ్లకు వేసుకునే సాక్స్‌లలో బిరియానీ ఆకు పెట్టుకుని పడుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఇంటి చిట్కాగా వైరల్ అవుతోంది. బిర్యానీ ఆకులో ఉండే యూజినాల్ వంటి నిరోధకాలు, ఆరోమాటిక్ నూనెలు పాదాల స్వేద గ్రంథుల ద్వారా ఉపశమనాన్ని ఇస్తాయని భావిస్తారు. అయితే, ఈ చిట్కాకు శాస్త్రీయ నిరూపణలు లేవని, ఇది కేవలం సాంప్రదాయ ప్రత్యామ్నాయ విశ్వాసం లేదా అరోమాథెరపీ ప్రభావం మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రచారంలో ఉన్న ఉపయోగాలు:

మంచి నిద్ర, మానసిక ప్రశాంతత: బిర్యానీ ఆకులో సహజసిద్ధమైన సువాసన నూనెలు ఉంటాయి. రాత్రి పూట వీటి నుండి వచ్చే సన్నని సువాసన మెదడును ప్రశాంతపరిచి, అరోమాథెరపీలా పనిచేసి త్వరగా నిద్ర పట్టడానికి సహాయపడుతుందని భావిస్తారు.

ఇవి కూడా చదవండి

నొప్పుల నుంచి ఉపశమనం: పాదాల అడుగుభాగంలో ఒత్తిడి బిందువులు ఉంటాయి. ఆకులోని యూజినాల్ అనే కాంపౌండ్ శోథ నిరోధక గుణాలను కలిగి ఉండటం వల్ల కాళ్ల అలసట, నొప్పులు తగ్గుతాయని ప్రచారం జరుగుతోంది.

యాంటీ బాక్టీరియల్ గుణాలు: బిర్యానీ ఆకులో ఉండే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పాదాల్లో బాక్టీరియా చేరకుండా చూసి, చెడు వాసన రాకుండా నిరోధిస్తాయి.

నిపుణులు, శాస్త్రీయ దృక్పథం:

ఈ చిట్కా ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, దీనికి ఎలాంటి ప్రత్యక్ష శాస్త్రీయ లేదా వైద్య ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. చర్మం ద్వారా బిర్యానీ ఆకులోని గుణాలు శరీరంలోకి చొచ్చుకెళ్లి నొప్పులను తగ్గిస్తాయని చెప్పడానికి పరిశోధనలు లేవు.

అయితే, బిర్యానీ ఆకులో ఉండే సువాసన నరాలను ఉత్తేజపరిచి, మానసిక ఉపశమనాన్ని ఇవ్వడం వల్ల ప్లేసిబో ప్రభావం లేదా అరోమాథెరపీ ప్రభావంతో కొందరికి ఉపశమనం లభించినట్లు అనిపించవచ్చు.

View this post on Instagram

A post shared by Harshit Raj (@imharshit.23)

జాగ్రత్తలు:

బిర్యానీ ఆకు వల్ల సాధారణంగా ఎలాంటి హాని ఉండదు. కానీ, సెన్సిటివ్ స్కిన్ లేదా చర్మ సమస్యలు, అలెర్జీలు ఉన్నవారు నేరుగా ఆకులను చర్మానికి తాకించేలా పెట్టుకోవడం వల్ల అలర్జిక్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాళ్ల నొప్పులు లేదా తీవ్రమైన నిద్రలేమితో బాధపడేవారు ఇటువంటి ప్రత్యామ్నాయ చిట్కాలపైనే ఆధారపడకుండా, సరైన వైద్య సలహా పొందడం శ్రేయస్కరం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సాక్స్‌లో బిర్యానీ ఆకు పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
సాక్స్‌లో బిర్యానీ ఆకు పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
జిమ్ జిమ్ తార పాటతో సినిమా ప్రమోషన్స్..
జిమ్ జిమ్ తార పాటతో సినిమా ప్రమోషన్స్..
2వ టీ20 నుంచి అతన్ని పీకేయాల్సిందే.. వైభవ్‌ తొలి మ్యాచ్‌కు రెడీ..
2వ టీ20 నుంచి అతన్ని పీకేయాల్సిందే.. వైభవ్‌ తొలి మ్యాచ్‌కు రెడీ..
దసరా వస్తుందని ఇదేం పనిరా.. ఎవర్రా మీరంతా.. అసలు ఏంచేశారో తెలిస్త
దసరా వస్తుందని ఇదేం పనిరా.. ఎవర్రా మీరంతా.. అసలు ఏంచేశారో తెలిస్త
కింగ్ నాగార్జున ఫోన్‌లో ఒక్క ఫొటో కూడా ఉండదు.. కారణమేంటో తెలుసా?
కింగ్ నాగార్జున ఫోన్‌లో ఒక్క ఫొటో కూడా ఉండదు.. కారణమేంటో తెలుసా?
దసరా పండుగకు 7 వేల ప్రత్యేక బస్సులు..తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
దసరా పండుగకు 7 వేల ప్రత్యేక బస్సులు..తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
నదిలో నీరు లేక గంగాళాల్లో కూర్చుని వరుణ జపం.. అర్చకుల వినూత్న పూజ
నదిలో నీరు లేక గంగాళాల్లో కూర్చుని వరుణ జపం.. అర్చకుల వినూత్న పూజ
 బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్‌కు.. ఉపయోగపడే కొర్రలతో జావ
 బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్‌కు.. ఉపయోగపడే కొర్రలతో జావ
సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే జీవితం హాయిగా ఉంది..
సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే జీవితం హాయిగా ఉంది..
దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్‌!
దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్‌!