AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toilet scrolling: బాత్‌రూమ్‌లో కూర్చొని రీల్స్‌ స్క్రోల్‌ చేస్తున్నారా?.. వెంటనే ఆపలేదో.. మీ బాడీ షెడ్డుకే!

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఫోన్‌లకే అతుక్కుపోతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా.. సోషల్‌ మీడియా ప్రపంచంలోనే బ్రతికేస్తున్నారు. కొంతమందైతే బాత్‌రూమ్‌లోనూ ఫోన్‌ చూస్తూ గంటల తరబడి కూర్చుంటున్నారు. కానీ ఇలా ఎక్కవ సమయం బాత్రూమ్‌లో రీల్స్‌ చూస్తూ ఉడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

Toilet scrolling: బాత్‌రూమ్‌లో కూర్చొని రీల్స్‌ స్క్రోల్‌ చేస్తున్నారా?.. వెంటనే ఆపలేదో.. మీ బాడీ షెడ్డుకే!
Toilet Scrolling
Anand T
|

Updated on: Sep 16, 2025 | 10:07 PM

Share

టెక్నాలజీ రోజురోజుకూ పెరుగుతోంది. మన జీవనశైలి కూడా అంతే. స్మార్ట్‌ఫోన్‌లు జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. కొంతమందైతే బాత్‌రూమ్‌లోనూ ఫోన్‌ చూస్తూ గంటల తరబడి కూర్చుంటున్నారు. ఈ అలవాటు చాలా మందికి రోజువారీ దినచర్యగా మారింది. ఇప్పుడు ఈ అలవాటు పెద్ద ప్రభావం చూపకపోయినా.. కాలక్రమేణా, తీవ్రమైన ఆరోగ్య పరిణామాలను కలిగిస్తుంది. ఇది మీ ప్రేగుల ఆరోగ్యాన్ని నాశనం చేయడమే కాకుండా హేమోరాయిడ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. టాయిలెట్‌లో మీరు ఫోన్‌ను ఉపయోగించడం వల్ల ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం.

ఎయిమ్స్, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్‌లలో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి ప్రకారం.. టాయిలెట్‌లో కూర్చుని స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే వారికి హెమోరాయిడ్స్ వచ్చే అవకాశం 46% ఎక్కువగా ఉన్నట్టు ఆయన తెలిపారు. ఇందుకు ప్రదాన కారణం ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోవడమే అంటున్నారు నిపుణులు. అధిక పీడనం వల్ల మలద్వారం, పురీషనాళంలోని సిరల్లో వాపు వస్తుందని.. ఇది మూలవ్యాధికి వచ్చే అవకాశాన్ని పెంచుతుందని ఆయన తెలిపారు. ఆహారం, వయస్సు, బరువు, శారీరక శ్రమ వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా, టాయిలెట్‌లో కూర్చుని ఫోన్ ఉపయోగించడం వల్ల మూలవ్యాధి ప్రమాదంపై బలమైన ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో దాదాపు 37 శాతం మంది ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం టాయిలెట్‌లో గడుపుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఐదు నిమిషాలు అంతగా అనిపించకపోవచ్చు, కానీ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అనేక మన శరీరంలోని అనే భాగాలపై నిరంతరం ఒత్తిడి పడుతుంది. ఇది కాలక్రమేనా అలవాటుగా మారినప్పుడు, అది క్రమంగా పురీషనాళంలోని సిరలను బలహీనపరుస్తుంది.

మలవిసర్జన సమయంలో ఒత్తిడికి గురికావడం అనేది మూలవ్యాధికి ఒక సాధారణ కారణమని మనని ఆయన చెబుతున్నారు. అలాగే, ఎక్కువసేపు టాయిలెట్‌లో కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ దెబ్బతింటుంది, ముఖ్యంగా కాళ్లలో. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ లేదా ఇప్పటికే ఉన్న ప్రసరణ సమస్యలు మరింత తీవ్రమవడానికి ఇది ఒక ప్రధాన అంశం. కాబట్టి మీరు బాత్రూంలో ఎక్కవ సమయం గడుపుతున్నట్టు అయితే వెంటనే ఈ అలావాటును మానుకోండి.

( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.