Barefoot walking: రోజూ చెప్పులు లేకుండా గడ్డిమీద నడిస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

ప్రస్తుతం ప్రజలు చెప్పులు లేకుండా నడవం అంటే అదేదో పెద్ద నేరంగా భావిస్తున్నారు. బయట మాత్రమే కాదు ఇంట్లో కూడా చెప్పులు ధరించే తిరిగేవారున్నారు. చెప్పులు ధరించి నడవడం ఆరోగ్యం అని భావిస్తున్నారు. అయితే చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ప్రతిరోజూ 30 నిమిషాలు చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో ఈ రోజు తెలుసుకుందాం..

Barefoot walking: రోజూ చెప్పులు లేకుండా గడ్డిమీద నడిస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
Barefoot Walking

Updated on: Jul 24, 2025 | 2:09 PM

ఫిట్‌గా ఉండటానికి ప్రజలు సాధారణంగా నడక, జాగింగ్‌ను ఆశ్రయిస్తారు. అయితే ఎటువంటి సందర్భంలోనైనా సరే చెప్పులు ధరిస్తారు. అయితే వాస్తవంగా రోజులో కొంత సేపు అయినా సరే చెప్పులు లేకుండా నడవడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలుసా? ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది చాలా సులభమైన, ఉచిత మార్గం. ప్రతిరోజూ చెప్పులు లేకుండా నడవడాన్ని ఇంగ్లీష్ లో బేర్ ఫుట్ వాకింగ్ అని అంటారు. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజూ గడ్డి మీద లేదా నేలపై చెప్పులు లేకుండా 30 నిమిషాలు నడవడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడటమే కాదు మానసిక ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతుందని అనేక పరిశోధనలు నిరూపించాయి. కనుక ప్రతిరోజూ 30 నిమిషాలు చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? ఇలా నడవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

పరిశోధన ఏం చెబుతోంది?
నేలపై చెప్పులు లేకుండా నడవడాన్ని గ్రౌండింగ్ లేదా ఎర్తింగ్ అంటారు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. జర్నల్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం ప్రతిరోజూ నేలపై చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. శరీరానికి నేరుగా భూమితో సంబంధం ఏర్పడినప్పుడు భూమి నుంచి పొందిన ఎలక్ట్రాన్లు శరీరంలో యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయని.. ఇది కణాల నష్టం ,తాపజనక ప్రతిచర్యలను తగ్గించడంలో సహాయపడుతుందని ఒక నివేదిక పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ప్రతిరోజూ చెప్పులు లేకుండా నడస్తే కలిగే ప్రయోజనాలు ఇవే

నిద్ర, మానసిక స్థితి మెరుగుపడుతుంది: చెప్పులు లేకుండా నడవడం ద్వారా శరీరం భూమిని తాకినప్పుడు.. దాని నుంచి విడుదలయ్యే శక్తి (భూమి సహజ ఎలక్ట్రాన్లు) మెలటోనిన్ (నిద్రను నియంత్రించే హార్మోన్) , సెరోటోనిన్ (మూడ్ స్టెబిలైజింగ్ హార్మోన్) సమతుల్యతను నిర్వహిస్తుంది. ఎవరైనా ప్రతిరోజూ 30 నిమిషాలు చెప్పులు లేకుండా నడిస్తే మనస్సును ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. మానసిక స్థితిని కూడా బాగా ఉంచుతుంది.

ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది: ప్రతిరోజూ చెప్పులు లేకుండా నడవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. చెప్పులు లేకుండా నడిచినప్పుడు శరీరంలో పేరుకుపోయిన విద్యుదయస్కాంత ఛార్జ్ విడుదల అవుతుంది. ఇది కార్టిసాల్ స్థాయిని (ఒత్తిడి హార్మోన్) తగ్గిస్తుంది.

వశ్యతను పెంచుతుంది: బూట్లు ధరించడం వల్ల మన పాదాలు ఎల్లప్పుడూ ఒకే విధంగా కదులుతాయి. అయితే చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాల కండరాలు, స్నాయువులు, చీలమండల కదలిక మెరుగుపడుతుంది. ఇది శరీరం వశ్యతను పెంచుతుంది. కీళ్ల నొప్పులు, దృఢత్వం, కండరాల బిగుతు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

రక్త ప్రసరణ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: పాదాల చర్మం నేలతో ప్రత్యక్ష సంబంధంలోకి వచ్చినప్పుడు రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. దీనివల్ల గుండె పంప్ చేయడం సులభం అవుతుంది. అధిక లేదా తక్కువ రక్తపోటు సమస్యలు సమతుల్యంగా ఉంటాయి. కాళ్ళ సిరల్లో ఆక్సిజన్ ప్రవాహం మెరుగుపడుతుంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)