కొంతమందికి నిద్ర లేచిన వెంటనే టీ, కాఫీలను తాగే అలవాటు ఉంటుంది. రోజు మొత్తంలో రకరకాల కారణాలతో ఎక్కువ మొత్తంలో టీ,కఫీలను తాగేవారున్నారు. అయితే తక్కువ సార్లు టీ తాగడం మంచిది.. అయితే ఎక్కువగా టీ లేదా కాఫీలను తాగే అలవాటు ఉంటే.. మిల్క్ టీకి బదులు అరటి పండుతో చేసిన టీ తాగడం బెస్ట్ అని చెబుతున్నారు నిపుణులు. అవును ఇప్పటి వరకూగ్రీన్ టీ, బ్లాక్ టీ, చామంతి టీ , మందారం టీ, మిర్చి తీ అంటూ రకరకాల టీల గురించి విన్నారు. ఇప్పుడు అరటి పండుతో తయారు చేసుకునే టీ గురించి తెలుసుకుందాం.. ఈ టీ చాలా టేస్టీగా ఉండడమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. దీనిని తయారు చేయడం చాలా సింపుల్ కూడా.. ఈ రోజు బనానా టీని తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం..
తయారీ విధానం: గ్యాస్ స్టవ్ మీద దళసరి గిన్నె పెట్టి.. అందులో నీరు పోసి మరిగించాలి. తర్వాత తొక్క తీసిన అరటిపండు చివరలు కట్ చేసి మరిగించిన నీటిలో వేయాలి. స్విమ్ లో పెట్టి అరటి పండు నీటిని మరిగించి దాల్చిన చెక్క వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లరినప్పుడు తేనెను వేసి అరటిపండు టీలో కలుపుకోవాలి. ఈ బనానా టీ గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. అయితే అరటి పండు తొక్క తీయకుండా టీని తయారు చేసుకోవచ్చు. ఈ టీలో పంచదార వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అరటి పండులోనే తియ్యదనం ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..