AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Back pain: బెడ్ రెస్ట్‌తో పనిలేదు.. ‘ఈ అలవాట్లు మానుకుంటే బ్యాక్ పెయిన్ కు బైబై చెప్పొచ్చు..

మీరు నడుము నొప్పితో బాధపడుతున్నారా? అయితే మీరు చేసే కొన్ని అలవాట్లే దానికి కారణం కావచ్చు. చక్కెరతో కూడిన టీ తాగడం, వేయించిన ఆహారాలు తినడం, తక్కువ ప్రోటీన్ తీసుకోవడం, అధిక బెడ్ రెస్ట్ వంటివి నడుము నొప్పిని తగ్గించవని ఆర్థోపెడిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నడుము నొప్పి అనేది చాలామందిని వేధించే సాధారణ సమస్య. సరైన చికిత్స తీసుకుంటున్నా, కొన్నిసార్లు నొప్పి తగ్గకుండా ఇబ్బంది పెడుతుంది. దీనికి కారణం మీ అలవాట్లే కావచ్చట.

Back pain: బెడ్ రెస్ట్‌తో పనిలేదు.. 'ఈ అలవాట్లు మానుకుంటే బ్యాక్ పెయిన్ కు బైబై చెప్పొచ్చు..
Back Pain Wont Go Away
Bhavani
|

Updated on: Jul 27, 2025 | 1:35 PM

Share

మీరు నడుము నొప్పితో నిత్యం బాధపడుతున్నారా? అయితే మీ రోజువారీ అలవాట్లే దానికి కారణం కావచ్చు. చక్కెరతో కూడిన టీ, వేయించిన ఆహారాలు, ప్రోటీన్ లోపం,ఎముకలను బలోపేతం చేయడానికి పోషకాహారం, నడుము నొప్పి నివారణపై తరచుగా సామాజిక మాధ్యమాల్లో సమాచారం పంచుకునే ఆర్థోపెడిక సర్జన్, డాక్టర్ రెహమాన్, జులై 22న షేర్ చేసిన ఒక పోస్ట్‌లో నడుము నొప్పి తగ్గకుండా అడ్డుకుంటున్న 4 ముఖ్యమైన అలవాట్లను వివరించారు. అధిక విశ్రాంతి వంటివి మీ నొప్పిని ఎలా పెంచుతున్నాయో తెలుసుకుందాం.

డాక్టర్ రెహమాన్ తెలిపిన వివరాల ప్రకారం, కొన్ని అలవాట్లను వదిలించుకోకపోతే మీ నడుము నొప్పి ఎప్పటికీ తగ్గదు. ఈ అలవాట్లు మీ నడుము నొప్పిని ఎలా ప్రభావితం చేస్తాయి, మీ డిస్క్ కోలుకోవడాన్ని ఎలా అడ్డుకుంటాయో ఆయన వివరించారు. మన వెన్నెముకలోని ఎముకల మధ్య ఉండే మెత్తటి కుషన్లను ‘ఇంటర్వెర్టెబ్రల్ డిస్క్‌లు’ అంటారు. ఈ డిస్క్‌లు షాక్ అబ్జార్బర్లుగా పనిచేసి, వెన్నెముకను స్థిరంగా ఉంచి, కదలికలకు సహాయపడతాయి. మరి ఆ 4 అలవాట్లు ఏమిటో చూద్దాం:

1. అధిక చక్కెర లేదా చక్కెరతో కూడిన టీ డాక్టర్ రెహమాన్ ప్రకారం, మీరు అధికంగా చక్కెర తీసుకోవడం లేదా ప్రతిరోజూ చక్కెరతో టీ తాగడం వల్ల మీ వెన్నెముక కింది భాగంలో, శరీరంలో మంట (Inflammation) పెరుగుతుంది. ఇది డిస్క్ కోలుకోవడాన్ని అడ్డుకుంటుంది.

2. వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలు వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల మీ వెన్నెముక కింది భాగంలో మంట పెరిగి, డిస్క్ కోలుకోవడాన్ని నిరోధిస్తుంది అని ఆర్థోపెడిక్ సర్జన్ నొక్కి చెప్పారు.

3. తక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం లేదా అధిక కార్బోహైడ్రేట్లు, అధిక కొవ్వులున్న ఆహారం తీసుకుంటే, డిస్క్ కోలుకునే సమయంలో దానికి తగినంత పోషణ అందదు. అధిక ప్రోటీన్ ఉన్న ఆహారం డిస్క్ మంచిగా కోలుకోవడానికి సహాయపడుతుంది అని ఆయన పేర్కొన్నారు.

4. అధిక బెడ్ రెస్ట్ అధికంగా బెడ్ రెస్ట్ తీసుకుంటూ, ప్రతిరోజూ నడవకపోతే, ఈ సందర్భాలలో కూడా మీ డిస్క్‌కు తక్కువ పోషణ అందుతుంది.

నేషనల్ స్పైన్ హెల్త్ ఫౌండేషన్ ప్రకారం, కాల్షియం మరియు విటమిన్ డి వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్న సమతుల్య ఆహారం వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పోషకాలు ఎముకల సాంద్రతను, కండరాల పనితీరును, మొత్తం కణజాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆస్టియోపొరోసిస్, డిజెనరేటివ్ డిస్క్ వ్యాధి, దీర్ఘకాలిక నడుము నొప్పి ప్రమాదాన్ని తగ్గించగలవు.