Dark neck remedies: మెడ చుట్టూ నలుపుదనాన్ని సింపుల్‌ చిట్కాలతో పోగోట్టుకోండిలా..!

|

Jul 05, 2024 | 12:16 PM

అయితే ఈ సమస్యను కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించి సులభంగా పరిష్కరించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మెడ చుట్టూ ఉన్న నల్లటి మచ్చలను తొలగించడంలో కొన్ని ఇంటి నివారణలు ప్రయోజనకరంగా పనిచేస్తాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Dark neck remedies: మెడ చుట్టూ నలుపుదనాన్ని సింపుల్‌ చిట్కాలతో పోగోట్టుకోండిలా..!
Dark Neck
Follow us on

చాలా మందికి ముఖం తెల్లగా ఉంటుంది. కానీ, మెడభాగంలో మాత్రం నల్లగా ఉంటుంది. దీనికి చాలానే కారణాలు ఉన్నాయి. అయితే ఈ సమస్యను కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించి సులభంగా పరిష్కరించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మెడ చుట్టూ ఉన్న నల్లటి మచ్చలను తొలగించడంలో కొన్ని ఇంటి నివారణలు ప్రయోజనకరంగా పనిచేస్తాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

పాలతో మసాజ్‌: పాలు ఒక అద్భుతమైన క్లెన్సర్, టోనర్. పచ్చి పాలను కాటన్ బాల్ సహాయంతో మెడ చుట్టూ అప్లై చేసి స్మూత్‌గా మర్ధనా చేయాలి. సుమారు 10 నుంచి 15 నిమిషాల తర్వాత మెత్తని గుడ్డతో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే, కొద్ది రోజుల్లోనే ఈ మెడ చుట్టూ ఉన్న నలుపు రంగు పోయి సహజ తెల్లదనం రావటం కనిపిస్తుంది.

శనగపిండి: శనగపిండిని చర్మసంరక్షణలో అనేక విధాలుగా ఉపయోగిస్తుంటారు. శనగ పిండి చర్మాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడుతుంది. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఇందుకోసం రెండు స్పూన్ల శనగ పిండి తీసుకుని, కొద్దిగా పసుపు, పెరుగు కలిపి పేస్ట్‌లా మిక్స్‌ చేయండి. ఈ పేస్ట్‌ను మెడకు అప్లై చేసి. 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తూ ఉంటూ మంచి ఫలితం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆలివ్ ఆయిల్‌: ఆలివ్ ఆయిల్‌లో పంచదార కలిపి మెడ చుట్టూ మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే నల్లటి మచ్చలు మాయమవుతాయి. ఆలివ్ నూనెలో విటమిన్ ఇ, కె పుష్కలంగా ఉన్నాయి. ఇది మంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఆలివ్ ఆయిల్ చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది

నిమ్మరసం: మెడ చుట్టూ పేరుకుపోయిన నల్లదనాన్ని పోగొట్టడంలో నిమ్మరసం మ్యాజిక్‌ చేస్తుంది. నిమ్మరసాన్ని మెడ చుట్టూ రుద్దడం వల్ల అద్భుతమైన స్కిన్ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. మెడ చుట్టూ ఉన్న నల్లటి మచ్చ కొన్ని రోజుల్లో మాయమవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..