
ఆరోగ్యానికి నీరు చాలా అవసరం. అందుకే డీహైడ్రేషన్ ఉన్నవారు నీళ్లు అధికంగా తాగాలని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉంటే, నీళ్లు తాగకుండా ఉండకూడదని హెచ్చరిస్తుంటారు. నిజానికి.. మానవ శరీరానికి నీళ్లు చాలా ముఖ్యం. శారీరక ఆరోగ్యానికి నీళ్లు ఎంత ముఖ్యమో, దానిని తాగడానికి ఉపయోగించే పాత్ర కూడా అంతే ముఖ్యం. ఏ సీజన్‌లో, ఏ పాత్రలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..
వేసవికాలంలో చల్లగా ఉండటానికి చాలా మంది కుండనీళ్లు తాగడానికి ఇష్టపడతారు. చాలా మంది రిఫ్రిజిరేటెడ్ నీటిని ఉపయోగిస్తారు. కానీ ఇది శరీరానికి హానికరం. బదులుగా మట్టి కుండలో నీరు తాగడం మంచి ఎంపిక. ఇది నీటిని సహజంగా చల్లగా ఉంచుతుంది. ఇందులో ఉండే ఖనిజాలు నీటి నాణ్యతను పెంచుతాయి. ఉదయం గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరం నుంచి విష పదార్ధాలను తొలగిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది ముఖానికి సహజమైన మెరుపును కూడా తెస్తుంది.
శీతాకాలంలో శరీరానికి వెచ్చదనం, రోగనిరోధక శక్తి అవసరం. ఈ సమయంలో బంగారు పాత్రలో నీరు తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. బంగారు పాత్ర లేకపోతే, మరే ఇతర లోహ పాత్రలోనైనా నీరు తాగవచ్చు. కానీ బంగారంతో చేసిన పాత్రలో నీరైతే బెటర్. ధనికుల ఇళ్లల్లో ఇలాంటి వస్తువులు ఉంటాయి. సమాన్యులు సాధారణ బిందెలో నీళ్లు తాగవచ్చు. ఈ నీరు నిరాశ, నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలను దూరం చేయడానికి సహాయపడుతుంది. ఇది దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
వర్షాకాలంలో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో రాగి పాత్ర నీళ్లు తాగడం సురక్షితం, ఆరోగ్యకరమైనది. రాగి నీళ్లు శరీరం నుంచి హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దీనికి యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. రాగి పాత్రలోని నీటిని రాత్రిపూట తాగడం వల్ల శరీరాన్ని విషపూరిత మూలకాల నుంచి రక్షిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాలానుగుణ వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.