పిల్లలకు ఈ వెన్న పండు తినిపిస్తే ఏమౌతుందో తెలుసా..? హెల్త్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే వదిలిపెట్టరు..

అవకాడో బ్లడ్‌ ప్రెజర్‌ సమతులం చేస్తుంది. ఇది సోడియం స్థాయిలను అదుపు చేస్తుంది. అవకాడో బీపీని అదుపుచేసి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇందులో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. అవకాడో స్ట్రోక్‌ ప్రమాదం రాకుండా చేస్తుంది. అవకాడోలో విటమిన్‌ ఇ, కెరోటెనాయిడ్స్‌ ఉంటాయి. ఇది ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ బారిని పడుకుండా చేస్తాయి. ఇందులో ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని లాభాలు కలిగి ఉన్న అవకాడో పిల్లలకు పెడితే ఏమౌతుందో తెలుసా..?

పిల్లలకు ఈ వెన్న పండు తినిపిస్తే ఏమౌతుందో తెలుసా..? హెల్త్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే వదిలిపెట్టరు..
Avocado

Updated on: Nov 03, 2025 | 7:19 PM

పిల్లల ఆరోగ్యం, శారీరక అభివృద్ధి విషయానికి వస్తే తల్లిదండ్రులు వారికి ఎప్పుడూ మంచి,పౌష్టికాహారం అందిచాలని ప్రయత్నిస్తారు. సెలబ్రిటీలు అయినా లేదా సాధారణ తల్లిదండ్రులు అయినా, వారు తమ పిల్లలకు ఉన్నదాంట్లో బెస్ట్‌ ఫుడ్‌ ఇస్తారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, బాగా అభివృద్ధి చెందాలని, వేగంగా ఎదగాలని కోరుకుంటారు. అయితే, సాధారణ తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలకు వారి సరైన పెరుగుదల కోసం ఏమి తినిపించాలో తెలియక ఆందోళన చెందుతారు. కానీ, పిల్లల పెరుగుదల,ఎత్తుకు అవకాడో అద్భుత ప్రయోజనాలు కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పిల్లలకు అవకాడో తినిపించడం వల్ల కలిగే ప్రయోజనాలు –నిపుణుల ప్రకారం.. అవకాడో పోషకాలతో కూడిన పండు. పిల్లలకు దీన్ని తినిపించడం వల్ల వారి శరీరానికి సరైన ఆరోగ్యం, అభివృద్ధికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు, అలాగే విటమిన్లు A, D, E, K వంటి 20 ముఖ్యమైన విటమిన్, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పండు పిల్లల శారీరక అభివృద్ధికి అలాగే వారి మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది పిల్లలకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది.

* పిల్లలకు అవకాడో తినిపించటం వల్ల కలిగే లాభాలు ఇలా ఉన్నాయి..

ఇవి కూడా చదవండి

– పిల్లల ఎముకలు, కండరాలను బలపరుస్తుంది.

– పిల్లల ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది.

– వారి కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.

– ఇది పిల్లల మనస్సును పదును పెట్టి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

– ఇది పిల్లలలో పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది.

– పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వారు అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతుంది.

* పిల్లల ఆహారంలో అవకాడోను ఎలా చేర్చాలి?

ఈ అద్భుతమైన పండును మీరు మీ పిల్లలకు వివిధ రకాలుగా తినిపించవచ్చు. పిల్లలు దీన్ని తినడానికి సులభమైన మార్గం అవకాడో పేస్ట్ తయారు చేసి బ్రెడ్ టోస్ట్ మీద అప్లై చేయొచ్చు. లేదంటే, అవకాడోను కట్ చేసి షేక్స్, స్మూతీల రూపంలో కూడా ఇవ్వవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..