బిగుతైన ప్యాంట్‌, షర్ట్స్‌ ధరిస్తున్నారా.. మానుకోండి లేదంటే ఆ సమస్య ఏర్పడవచ్చు..!

|

Mar 09, 2022 | 9:21 AM

Tight Pants Shirts: కంఫర్ట్‌గా ఉన్నాయని బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తున్నారా.. జాగ్రత్త ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది. ఫ్యాషన్ కోసమని టైట్ దుస్తులు ధరిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు

బిగుతైన ప్యాంట్‌, షర్ట్స్‌ ధరిస్తున్నారా.. మానుకోండి లేదంటే ఆ సమస్య ఏర్పడవచ్చు..!
Tight Pants, Shirts
Follow us on

Tight Pants Shirts: కంఫర్ట్‌గా ఉన్నాయని బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తున్నారా.. జాగ్రత్త ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది. ఫ్యాషన్ కోసమని టైట్ దుస్తులు ధరిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత కాలంలో యువత నుంచి పెద్దల వరకు అందరూ టైట్ దుస్తులను ధరిస్తున్నారు. అయితే అలా ధరించడం వల్ల చేతులు, కాళ్లకి రక్తప్రసరణ సరిగ్గా జరగడం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల చేతులు, కాళ్లలో తిమ్మిరులు వస్తున్నాయి. ఇది చాలాకాలం కొనసాగితే చాలా ప్రమాదం. అందుకే వదులుగా ఉండే దుస్తులు ధరిస్తే అందరికి మంచిది. మన శరీరంలో చాలా సిరలు ఉంటాయి. ఇవి రక్తం, ఆక్సిజన్‌ను ఒక భాగం నుంచి మరొక భాగానికి రవాణా చేయడానికి పని చేస్తాయి. మనం ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చున్నా లేదా పడుకున్నా ఆ నరాలు మూసుకుపోతాయి. అలాగే టైట్‌ డ్రెస్సులు వేసుకున్నప్పుడు అవి చర్మాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. దీనివల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగడం లేదు. దీంతో తిమ్మిరి సమస్యలు వస్తున్నాయి. ఇదికాకుండా టైట్‌గా ఉండే దుస్తులు వేసుకున్నప్పుడు చర్మం కోతకు గురై ఇన్‌ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా తేమలాంటి పదార్థంలా పేరుకుపోతుంది. దీనికి వెంటనే చికిత్స చేయకపోతే ఆ ప్రదేశంలో చర్మ గ్రంధులు మూసుకుపోయి ప్రాణాంతక ఇన్ఫెక్షన్‌గా మారుతుంది. ఇది ఇమ్యూనిటీ బలహీనంగా ఉండే వారికి సోకే అవకాశం ఎక్కువగా ఉంది.

టైట్ డ్రెస్సులు వేసుకోవడం వల్ల సెప్సిస్, సెల్యూలైటీస్ అనే స్కిన్ ఇన్‌ఫెక్షన్ సోకుతుంది. ఈ ఇన్‌ఫెక్షన్ తీవ్రమైతే.. అలర్జీ వల్ల రక్తం ద్వారా ఒళ్లంతా వ్యాపించి.. అన్ని అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. దీని వల్ల ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. వైద్యుల ప్రకారం.. చేతివేళ్లు, కాలి వేళ్లలో అప్పుడప్పుడు తిమ్మిరి వస్తే ఏం కాదు. కానీ పదే పదే ఈ సమస్యను ఎదుర్కొంటే మాత్రం ప్రమాదం. అలాగే గొంతులో వణుకు, చేతులు, కాళ్లు వణుకు వంటి సమస్యలు ఉంటే వైద్యులకు చూపించడంలో ఆలస్యం చేయకూడదు. వెంటనే చికిత్స ప్రారంభించాలి. తద్వారా వ్యాధి పెద్దదిగా కాకుండా నయం చేయవచ్చు.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Women: మగవారి ఈ అలవాట్లు స్త్రీలకు అస్సలు నచ్చవు.. కారణం ఏంటంటే..?

Zodiac Signs: మార్చిలో ఈ 4 రాశుల వారి జీవితాల్లో చాలా మార్పులు.. కనకవర్షం కురుస్తుంది..!

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయి చెల్లించండి.. స్కూటీని ఇంటికి తీసుకెళ్లండి..!