
మహిళల్లో నెలసరి సమయం చాలా ముఖ్యం. నెలసరి సరైన సమయానికి రావడం వల్ల మహిళల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కొంత మందిలో ఈ సమయం లేట్‌గా వస్తుంది. మరి కొంత మందిలో త్వరగా వస్తుంది. శరీరంలో ఉండే అనారోగ్య సమస్యల వల్ల ఇలా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే పీరియడ్స్ టైమ్‌లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా బయటకు ఎక్కడికైనా వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. దీంతో చాలా మంది డేట్ సమయానికి రాకుండా ఉండాలని ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. కొంత మంది కావాలనే డేట్ రాకుండా ఉండేందుకు వేసుకుంటారు.
కానీ ఇలా ఈ ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడటం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అయితే ఇవి ఎప్పుడో ఒకసారి తీసకుంటే పర్వాలేదు కానీ.. పదే పదే వాడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెబుతున్నారు. పీరియడ్స్ రాకుండా ఉండేందుకు వాడే ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు చూడండి.
పీరియడ్స్ ఆలస్యంగా రావడం కోసం మందులు తీసుకోవడం వల్ల రక్తం గడ్డ కడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తం గడ్డ కట్టడం వల్ల అనేక సమస్యలు శరీరంలో ఏర్పడతాయిని.. ప్రాణానికే ప్రమాదమని సూచిస్తున్నారు.
పీరియడ్స్ రాకుండా మందులు వేసుకోవడం వల్ల సెక్స్ హార్మోనలపై ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా మహిళలు లిబిడో లోపం బారిన పడాల్సి ఉంటుంది. అంతే కాకుండా సంతానోత్పత్తి సమస్యలు కూడా ఎదురవుతాయి.
నెలసరి లేట్ రావడానికి మందులు వాడటం వల్ల హార్మోన్‌లలో అనేక మార్పులు వస్తాయి. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. దీని వల్ల చాలా సమస్యల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. చర్మం రంగు మారడం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి.
పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి ట్యాబ్లెట్స్ వాడటం వల్ల చాలా మందిలో మూడ్ స్వింగ్స్ సమస్య పెరుగుతుంది. దీని వల్ల అలసటగా నీరసంగా ఉంటారు. ఒక్కోసారి గందరగోళంగా ఉంటుంది. అప్పటికప్పుడే కోపం, చిరాకు, అసహనం వంటివి పెరుగుతాయి.
ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడటం వల్ల శరీరంలో ఒత్తిడి కూడా పెరుగుతుంది. కొంత మందిలో ఇది డిప్రెషన్‌కు కూడా దారి తీస్తుంది. కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ వాడే ముందు వైద్యులను సంప్రదిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.