మంగు మచ్చలతో ఇబ్బందిపడుతున్నారా..? ఇలాంటి ఇంటి చిట్కాలతో అందంగా మారిపోండి!

|

Dec 31, 2024 | 7:01 PM

శరీరంలో మెలనిన్ కంటెంట్ ఎక్కువగా, ఐరన్ కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు పిగ్మెంటేషన్ ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా ఈ మంగుమచ్చలు వస్తుంటాయని చెబుతున్నారు. సాధారణంగా కొందరికి బుగ్గలపై, కొందరికి ముక్కుపై, మరికొందరికి ముఖం అంతా పిగ్మెంటేషన్ ఉంటుంది. దీని కోసం

మంగు మచ్చలతో ఇబ్బందిపడుతున్నారా..? ఇలాంటి ఇంటి చిట్కాలతో అందంగా మారిపోండి!
Pigmentation
Follow us on

మీ ముఖం ఎంత తేజస్సుతో ఉన్నప్పటికీ మంగుమచ్చలు, పిగ్మెంటేషన్ మీ అందాన్ని పాడు చేస్తుంది. ఇటీవలి కాలంలో చాలా మందిని మంగుమచ్చల సమస్య వేధిస్తోంది. శరీరంలో మెలనిన్ కంటెంట్ ఎక్కువగా, ఐరన్ కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు పిగ్మెంటేషన్ ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా ఈ మంగుమచ్చలు వస్తుంటాయని చెబుతున్నారు. సాధారణంగా కొందరికి బుగ్గలపై, కొందరికి ముక్కుపై, మరికొందరికి ముఖం అంతా పిగ్మెంటేషన్ ఉంటుంది. దీని కోసం ఇక్కడ బెస్ట్, సింపుల్ హోం రెమెడీస్ ఉన్నాయి. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం…

మంగుమచ్చలకు బంగాళదుంప రసం దివ్యౌషధం అంటున్నారు నిపుణులు. బంగాళదుంపలో కాటెకోలేస్ ఉంటుంది. ఇది ముఖాన్ని శుభ్రపరుస్తుంది. బంగాళాదుంప రసాన్ని ఉపయోగించడం వల్ల మొటిమలు, నల్ల మచ్చలు వంటి అనేక చర్మ సమస్యలను నయం చేయవచ్చు. బంగాళదుంప రసాన్ని తీసి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే నల్ల మచ్చలు పోయి ముఖ సౌందర్యం పెరుగుతుంది.

పిగ్మెంటేషన్ తగ్గించటంలో పచ్చిపాలు బెస్ట్‌ రెమిడీ అంటున్నారు నిపుణులు. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో మేలు చేస్తుంది. ఇందుకోసం ఒక చిన్న గిన్నెలో పాలు పోసి కాటన్ బాల్‌ను నానబెట్టండి. పాలలో నానబెట్టిన దూదిని రోజుకు రెండుసార్లు ముఖంపై నల్లటి మచ్చల మీద రాస్తూ ఉండాలి.. ఇలా రోజూ చేయడం వల్ల మీ ముఖం మృదువుగా, మచ్చలు లేకుండా కాంతివంతంగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

చర్మ సౌందర్యానికి కలబంద మంచి ఆయుర్వేద ఔషధం. స్వచ్ఛమైన కలబందను ముఖానికి పట్టిస్తే మొటిమల సమస్య తగ్గిపోతుంది. హైపర్పిగ్మెంటేషన్‌కు సమర్థవంతమైన చికిత్సగా కలబందను ఉపయోగిస్తారు. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు మంగుమచ్చలు ఉన్న చోట స్వచ్ఛమైన అలోవెరా జెల్‌ను అప్లై చేసుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే త్వరలో మంచి ఫలితాలు వస్తాయి.

మంగుమచ్చలకు బొప్పాయి కూడా మంచి ఫలితానిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి పండులో పాపైన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పిగ్మెంటేషన్‌కు మంచి ఇంటి నివారణగా పని చేస్తుంది. తురిమిన బొప్పాయి రసాన్ని రోజూ ముఖానికి పట్టించి కాసేపు ఆరిన తరువాత శుభ్రంగా వాష్‌ చేసుకోవాలి. కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాన్ని చూస్తారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..