మనలో చాలా మందికి నిద్రలో కండరాలు పట్టేయడం, తిమ్మిర్లు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. కండరాల పట్టేసినప్పుడు విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఆ నొప్పి నుంచి తేరుకోవడానికి రెండు, మూడు గంటలు పట్టేస్తుంది. అయితే కండరాల తిమ్మిర్లు, పట్టేయడానికి రెండు కారణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో లవణాలు తగ్గడం వల్ల, వ్యాయామాలు చేయకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయట. శరీరంలో క్యాల్షియం వంటి లవణాల లోపం వల్ల కండరాల తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. దీంతో ఈ సమస్య నుండి బయట పడటానికి.. మందులను వాడుతూ ఉంటారు. కానీ కొన్ని సహజ సిద్ధంగా ఈ సమస్య నుండి బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటే ఇప్పుడు చూద్దాం.
కండరాల తిమ్మిర్లు, నొప్పులు తగ్గాలంటే.. శరీరానికి తగినన్ని లవణాలు అందాలి. ఆకు కూరల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. వీటి సమస్యను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా తోటకూర తీసుకోవడం వల్ల కండరాల తిమ్మిర్లు చాలా చక్కగా తగ్గుతాయి. ఆకుకూరలను తీసుకోవడం వల్ల 10 రోజుల్లోనే మంచి ఫలితాలను పొందవచ్చు.
అదే విధంగా నువ్వులు తినడం వల్ల కూడా కండరాల తిమ్మిర్లు, నొప్పులు తగ్గించుకోవచ్చు. నువ్వుల్లో మంచి పోషకాలు ఉంటాయి. అదే విధంగా మెండుగా క్యాల్షియం ఉంటుంది. దీంతో కండరాల తిమ్మిర్ల నుంచి మంచి ఉపశమనం పొంద వచ్చు.
కండరాల నొప్పులు, తిమ్మిర్లతో బాధ పడేవారు కొబ్బరి నీరు తాగడం వల్ల కూడా మంచి ఉపశమనం పొందుతారు. ఈ నీటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరానికి తగినంత సోడియం అందుతుంది.
సరిగ్గా వ్యాయామాలు చేయకపోవడం వల్ల కూడా కండరాల తిమ్మిర్లు, నొప్పులు వస్తూ ఉంటాయి. శరీర భాగాలను కదిలించకుండా ఉంటే.. కండరాలు బలహీనంగా ఉంటాయి. అనుకోకుండా అప్పుడప్పుడూ కదిలించినప్పుడు కండరాలు పట్టేసినట్టుగా, తిమ్మిర్లు వచ్చినట్టుగా అనిపిస్తుంది. కండరాల నొప్పులతో బాధ పడేవారు ఖచ్చితంగా వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. మెడ నుంచి శరీర భాగాలు అన్నీ కదిలేలా ఏదో ఒక వ్యాయామం చేయడం మంచిది. వీటితో పాటు ఈ ఆహారాలు తింటే కండరాల సమస్యల నుంచి బయట పడొచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.